హుజూరాబాద్‌టౌన్, మే 24: డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ కెరీర్‌ను ఎలా మలచుకోవాలో నిపుణుల సలహాలు, సూచనలతో అవగాహన పెంచుకోవాలని హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గొడిశాల పరమేశ్ సూచించారు. హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎస్వీసీ కెరీర్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో వర్చువల్‌గా విద్యార్థులతో కెరీర్ గైడెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయని, కెరీర్ గైడెన్స్ సెల్ ద్వారా ఉద్యోగావకాశాలు విద్యార్థులకు తెలియజేస్తామన్నారు. ఎస్వీసీ కెరీర్ సొల్యూషన్స్ సంస్థ అధినేత శ్రీనాథ్ మాట్లాడుతూ, మల్టీ నేషనల్ కార్పొరేషన్ కంపెనీలైన ఇన్ఫోసిస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ మొదలైన కంపెనీల్లో విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో కెరీర్ గైడెన్స్ సెల్ కో-ఆర్డినేటర్ ఎస్ మధు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్, వాణి జ్య శాస్త్ర విభాగాధిపతి పీఎల్ఎన్ మూ ర్తి, టీఈ ఏసీ కో-ఆర్డినేటర్ డా. దినకర్, ఎకనామిక్ కో-ఆర్డినేటర్ సమ్మ య్య, ఉపన్యాసకులు ఉదయశ్రీ, చారి, రాజ్‌కుమార్, హరిప్రసాద్, డాశ్రీనివాస్, స్వరూప, స్వప్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
యువత తమ భవిత కోసం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పలు కోచింగ్ సెంటర్లు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఇందుకోసం హైదరాబాద్, విజయవాడ లాంటి పెద్ద పట్టణాల నుంచి పేరుగల ఫ్యాకల్టీని తీసుకువచ్చి శిక్షణ అందిస్తున్నారు. దీంతో జిల్లాలోని కోచింగ్ సెంటర్లు బిజీగా మారిపోయాయి. పెద్ద సంఖ్యలో యువత జిల్లా కేంద్రాలకు చేరుకుని కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్స్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. కేఎన్ఆర్, లక్ష్యం, ప్రజ్ఞ, టీచర్స్ అకాడమి, రామప్ప, శ్రీవికాస్, కిట్స్ అకాడమీ, ఎస్ 3, అక్టా హైడ్రాక్, ఏసీ రెడ్డి లాంటి ఇనిస్టిట్యూట్ ఈ శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ ఇస్తున్నారు.