రాంనగర్, మే 18: సైబర్ నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ఐటీ, ఇండస్ట్రి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాన్సెప్ట్ ప్రజెంటేషన్‌పై బుధవారం ఆయన సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ల యొక ఆవశ్యకత చాలా ఉందన్నారు. ఇందు కోసం పోలీస్ శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించి ప్రతి పోలీస్ స్టేషన్లో ఇద్దరిని సైబర్ వారియర్‌గా నియమించినట్లు తెలిపారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర సీనియర్ పోలీసు అధికారులకు సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు అందజేశారు. కాగా, సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించడం, తదితర అంశాలతో రూపొందించిన ‘ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ సిరీస్ 3.0’ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిషరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీ వి సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, ఏసీపీలు కాశయ్య, సత్యనారాయణ, కమ్యూనికేషన్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్ఐ మురళి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.