మేం ఓ షాపు పెడ్తమని ఎప్పుడూ అనుకోలె. షాపులో పని చేయడమే మాకు తెలుసు. కానీ, ఇప్పుడు మొబైల్ షాపు ఓనైర్లెనమంటే అది సీఎం కేసీఆర్ పుణ్యమే. నేను, నా భర్త కూలి పనులు చేసి నా ఇద్దరు కొడుకులను సాదినం. పెద్దోడు రాజేందర్, చిన్నోడు శ్రావణ్ ఈ షాపును నడిపిస్తరు. చిన్న కొడుకుకు సెల్ షాపుల పనిచేసిన అనుభవం ఉన్నది. ఈ షాపు మా కుటుంబానికి ఎంతో పెద్ద ఆస్తి. ఈ రోజుల్లో దగ్గరోళ్లు కూడా సాయం చేస్తలేరు. వడ్డీలకు అడిగినా అప్పు ఇస్తలేరు. అలాంటిది సీఎం కేసీఆర్ సారు తిరిగి కట్టకుండా 10 లక్షలు ఇచ్చిండు. ఇంత మేలు చేసిన ఆ సారుకు ఎప్పటికీ రుణపడి ఉంటం.
– వడ్లూరి లక్ష్మి, నల్లకుంటపల్లి (కరీంనగర్ రూరల్ మండలం)