వెల్గటూర్, మే 16: తెలంగాణ సర్కారు అన్ని రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తూ ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. తెలంగాణ సర్కారు ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలువబోతున్నదని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్‌రావ్‌పేట, కొత్తపేట, ముత్తునూర్ గ్రామాల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ఎంపీ వెంకటేశ్‌నేతతో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కారు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించిందని పేర్కొన్నారు. మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3,497.62 కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
వెల్గటూర్ మండలంలో మొదటి విడుత 18 పాఠశాలలను ఎంపిక చేసి 3 గ్రామాల్లో రూ.73 లక్షలతో మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో మాధురి, ఎంపీపీ కునమల్ల లక్ష్మి, జడ్పీటీసీ సుధారాణి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, డీఈవో జగన్మోహన్రెడ్డి, ఎంఈవో భూమయ్య, ఎంపీడీవో సంజీవరావు, తహసీల్దార్ రమేశ్, సర్పంచులు కొమ్ము రాంబాబు, అనుమాల తిరుపతి, మేర్గు కొమురయ్య, మారం జలేందర్‌రెడ్డి, బోడకుంటి రమేశ్, కంది లావణ్య-విష్ణు, మెతుకు స్వరూప-స్వామి, గాగిరెడ్డి లింగమ్మ-రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ సప్ప జ్యోతి-రాజు, ప్యాక్స్ చైర్మన్లు రాంరెడ్డి, రత్నాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జగన్, నాయకులు ఏలేటి కృష్ణారెడ్డి, పత్తిపాక వెంకటేశ్, జూపాక కుమార్, మూగల సత్యం, ఎండీ రియాజ్, పెద్దూరి భరత్, గుండా జగదీశ్వర్, మహేందర్‌రెడ్డి, పులి రాయనర్సు, కుమ్మరి వెంకటేశ్, గుడికందుల సత్యం, బోగె రాజయ్య, తరల్ల చంద్రయ్య, అల్గునూరి సత్యం, తిరుపతి, మహిళలు, యువకులు పాల్గొన్నారు.