హుజూరాబాద్‌టౌన్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్కు అండగా నిలువాలని, రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గులాబీ శ్రేణులు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. టీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా శనివారం ప్రజాప్రతినిధులు, నాయకులు పట్టణంలోని 19, 21, 22, 27వ వార్డుల్లో గడపగడపకూ వెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రూపొందించిన కరపత్రాలను ఇంటింటా పంచుతూ ఓటు అభ్యర్థించారు. 22వ వార్డులో విద్యార్థి, యువకుల సర్వే నిర్వహించి వారి అభిప్రాయాలను టీఆర్ఎస్యూత్ నాయకులు టేకుల శ్రవణ్, గాలిపెల్లి రాకేశ్, కార్యకర్తలు సేకరించారు. ఆయా వార్డుల్లోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. 27వ వార్డులో ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలను ఇస్తూ టీఆర్ఎస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఇక్కడ వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, సిద్దిపేట కౌన్సిలర్ బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మూశం మార్కండేయ, ఎండీ ఇసాక్, మూల వెంకటరమణగౌడ్, రాంరెడ్డి, తిరుపతి, టీఆర్ఎస్ కార్యకర్తలు, పెన్షన్‌దారులు ఉన్నారు. 19వ వార్డులోని కిందివాడలో చేపట్టిన ప్రచారంలో టీఆర్ఎస్వై పట్టణాధ్యక్షుడు గందె సాయిచరణ్, టీఆర్ఎస్వీ పట్టణాధ్యక్షుడు విడపు అనురాగ్, నాయకులు ఎస్కే ఫయాజ్ తదితర వార్డు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 21వ వార్డులో కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మంద ఉమాదేవి ఇంటింటికీ వెళ్లి బొట్టు పెడుతూ, కరపత్రాలు పంచుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఇల్లందకుంట రూరల్, సెప్టెంబర్ 4: మండలంలోని పాతర్లపల్లి, కనగర్తి, వాగొడ్డు రామన్నపల్లి గ్రామాల్లో శనివారం టీఆర్ఎస్ మండల యూత్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని కోరారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని యూత్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కనగర్తి ఎంపీటీసీ దుర్గల రాకేశ్, తనుగుల తిరుపతి, జవాజి అనిల్, నల్ల జీవన్‌రెడ్డి, బెల్లం మహేందర్, చింతల కౌశిక్, సాయికుమార్, తోడేటి రాజు, మధు, గడ్డి గోవర్ధన్, లక్ష్మణ్, రాజేందర్, దిలీప్, శివకృష్ణ, రాజేందర్, లక్ష్మణ్, వీరస్వామి, తిరుపతిరెడ్డి, రాజేందర్‌రెడ్డి, తిరుపతి, పృథ్వీ, రాకేశ్, గణేశ్, శివ, రణధీర్, వినీత్, రాజుకుమార్రెడ్డి, రాజ్‌పాల్‌రెడ్డి, రామకృష్ణ, రాజు, ప్రశాంత్, ప్రవీణ్ పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, సెప్టెంబర్ 4: టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఓటేసి గెలిపించాలని ఎంపీపీ దొడ్డె మమత ప్రజలను కోరారు. శనివారం పెద్దంపల్లి గ్రామంలో సర్పంచ్ ఇల్లందుల అన్నపూర్ణ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించగా, ఎంపీపీ పాల్గొన్నారు. గడప గడపకూ తిరుగుతూ బొట్టు పెట్టి కరపత్రాలు పంచారు. టీఆర్ఎస్కు ఓటేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో మహిళా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్ 4: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం ఆయన సతీమణి శ్వేత శనివారం మండలంలోని జూపాక గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను బొట్టు పెడుతూ అభ్యర్థించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి, సర్పంచ్ అంకూస్, ఎంపీటీసీ కంకణాల వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు కేతిరి రాజిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, తాళ్లపల్లి రాజేందర్, వెంకటేశ్, శ్రీనివాస్ తదితరులున్నారు.
వీణవంక, సెప్టెంబర్ 4: మామిడాలపల్లి, ఇప్పలపల్లి, ఘన్ముక్ల, ఎలుబాక, గంగారం గ్రామాలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ ముసిపట్ల రేణుక స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు బండ సుజాత, కాంతారెడ్డి, కోమల్‌రెడ్డి, ఎంపీటీసీలు మూల రజిత, వీరారెడ్డి, సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ పుప్పాల రోజా, నాయకులు బండ కిషన్‌రెడ్డి, మూల పుల్లారెడ్డి, పుప్పాల రాములు, శ్యాంసుందర్‌రెడ్డి, కొయ్యడ మొగిలి, లక్ష్మణ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.