చొప్పదండి, మే 6: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 29 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7,98,500 విలువైన ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, గంగాధర మండలం బూర్గుపల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన నగదును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సర్పంచులు గుంట రవి, పెద్ది శంకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ గొల్లపల్లి శ్రావణ్‌కుమార్, ఆర్బీఎస్ జిల్లా, మండల కో-ఆర్డినేటర్లు మచ్చ రమేశ్, గుడిపాటి వెంకటరమణారెడ్డి, బీసవేని రాజశేఖర్, కొత్తూరి నరేశ్ పాల్గొన్నారు.
మండలంలోని 19 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 6,65,500 విలువైన ఆర్థిక సాయం మంజూరైంది. గంగాధర మండలం బూర్గుపల్లిలోని తన నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వెంకట్రావుపల్లి సర్పంచ్ జవ్వాజి శేఖర్, టీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, మామిడి తిరుపతి, ఎడవెల్లి పాపిరెడ్డి, ఎడవెల్లి మల్లేశం, జూపాక మునీందర్, బత్తిని తిరుపతిగౌడ్, కొడిమ్యాల రాజేశం, మొయిజ్ఖాన్, గడ్డం మోహన్‌రావు, శనిగరపు అనిల్‌కుమార్, బీ సురేశ్ పాల్గొన్నారు.
గంగాధర, మే 6 : మండలంలోని 23 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 5,84,500 ఆర్థిక సాయం మంజూరైంది. బూరుగుపల్లిలో ఆయన నివాసంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మడ్లపెల్లి గంగాధర్, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు ముద్దం నగేశ్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, మడ్లపెల్లి శ్రీనివాస్, జారతి సత్తయ్య, చిలుముల రమేశ్, రేగుల తిరుపతి, సుంకె అనిల్, గంగాధర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.