హుజూరాబాద్ పట్టణాభివృద్ధి జోరందుకున్నది. అధ్వానంగా మారిన అంతర్గత రహదారులు, డ్రైనేజీలు.. తదితర సమస్యలతో ఏండ్ల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం ఇటీవల రూ.90 కోట్లు కేటాయించగా, పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏడేళ్లుగా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ చేయలేని అభివృద్ధి యుద్ధప్రాతిపదికన సాకారమవుతుండడంపై పట్టణ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రూ.45కోట్లతో అంతర్గతరోడ్లు, డ్రైనేజీలు..
మిషన్ భగీరథ పనులు 2016 మొదట్లో ప్రారంభం కాగా, ఆ సమయంలో ప్రధాన పైపులైన్ పనులు జరిగాయి. 2016 చివరలో పట్టణంలో రూ.5కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి ఆరు నెలల్లో పూర్తి చేశారు. 2017 మార్చిలో మిషన్ భగీరథ పనులు చేపట్టడంతో సీసీ రోడ్లన్నీ అక్కరకు రాకుండా పోయాయి. అయితే పట్టణంలో కూడా మిషన్ భగీరథ పనులు జరుగుతాయని మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌కు తెలిసినా సీసీ రోడ్ల నిర్మాణం ఎందుకు చేపట్టాడో ఆయనకే తెలియాలి. కనీసం ఓ ఆరు నెలలు ఆగినా ఇప్పుడు మళ్లీ సీసీ రోడ్లను వేయాల్సిన అవసరం ఉండేది కాదని ప్రజలు అంటున్నారు. అంతర్గత రోడ్లన్నీ దుమ్ముతో నిండాయి. వర్షం వస్తే బురదగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, మున్సిపల్ పాలకవర్గం ఈటల రాజేందర్‌కు విన్నవించినా పెడ చెవినా పెట్టాడని వాపోతున్నారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత అభివృద్ధికి నోచుకోని పట్టణ పరిస్థితిని ప్రజాప్రతినిధులు జిల్లా మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. అంతర్గతరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.45కోట్ల మంజూరుకు చొరవ చూపారు. దీంతో ఇప్పుడు పనులు ప్రారంభమై శరవేగంగా కొనసాగుతున్నాయి.
మారనున్న ప్రధాన రహదారి రూపురేఖలు
పట్టణ పరిధిలోని కేసీ క్యాంపు నుంచి కొత్తపల్లిలోగల ఇందిరానగర్ వరకు దాదాపు ఐదు కిలో మీటర్ల మేర కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారి ఉంటుంది. ఈటల రాజేందర్ రాజీనామా చేయకముందు ఈ రహదారి మొత్తం గుంతలమయంగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా విశాలమైన స్థలం ఉండగా.. అదంతా మట్టితో నిండిపోయింది. వర్షం వస్తే రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాదారులు బురదతో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ప్రభుత్వ చొరవతో ఆ రహదారి రూపురేఖలు మారిపోనున్నాయి. దుకాణాల ఎదుట ఫుట్‌పాత్‌లు నిర్మించి మిగిలిన స్థలంలో బీటీ రోడ్డు వేయనున్నారు. మొక్కలు నాటేందుకు ప్రత్యేక ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు. రహదారి పనులు పూర్తయితే ఎక్కడా మట్టి జాడ కనబడదు. దీని కోసం ప్రభుత్వ రూ.25కోట్లు కేటాయించింది. ప్రభుత్వం రెండు చోట్ల బ్రిడ్జిల నిర్మాణానికి రూ.కోటీ 50 లక్షలు కేటాయించింది. ఒడ్డెర కాలనీ దగ్గర రూ.కోటితో బ్రిడ్జి, ఇప్పల్‌నర్సింగాపూర్‌లో రూ.50లక్షలతో రోడ్యాం నిర్మించనున్నారు.
రూ.10కోట్లతో మిషన్ భగీరథ పనులు..
మిషన్ భగీరథ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆశయం ఈటల రాజేందర్ నిర్లక్ష్యంతో నెరవేరలేదు. ఇంటింటికీ సత్వరమే నీళ్లు అందించడంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు రూ.10కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు అనుగుణంగా పనులు కొనసాగుతుండగా, పైపులైన్ల పని 95శాతం పూర్తయింది. పనులు చకచకా కొనసాగుతుండడంతో పట్టణ ప్రజలు సంతోషపడుతున్నారు.
ఇంత స్పీడ్‌గా రోడ్డువుతుందనుకోలే..
ఎన్నో ఏళ్లుగా మా వాడకు సీసీ రోడ్డు లేదు. బొందల రోడ్డులో నీళ్లు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడేటోళ్లం. జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో రోడ్డు పూర్తయింది. ఇప్పుడు మా వాడలో ఎంతో చకగా సీసీ రోడ్డు నిర్మించిన్రు. ఇపుడు మాకు ఇబ్బందులు తొలగిపోయాయి. మా కష్టాలు తీర్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటాం.
-కాపర్తి అనిల్-సౌజన్య, 22వ వార్డు
రోడ్డు వేస్తరని ఊహించలేదు
రోడ్డు గురించి ఎన్నిసార్లు చెప్పినా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. మా వాడకు వచ్చిన మంత్రి గంగుల కమలాకర్‌కు ఒక్కసారి చెప్పగానే సీసీ రోడ్డు వేయించిండు. మాకు ఇంత తొందర్లో రోడ్డు వస్తుందని ఊహించలేదు. రోడ్డు వేసి దుమ్ము, ధూళి, బురద నుంచి మమ్మల్ని కాపాడిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి రుణం తీర్చుకుంటం.
-దాచేపల్లి రాజశేఖరం, రిటైర్డ్ ఉద్యోగి, 28వ వార్డు
మా బాధలన్నీ తీరినై..
వానకాలంలో మా ఇంటి ముందట రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు నిలిచేవి. ఎండకాలం అయితే దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడేటోళ్లం. ఇంకా ఇంటి ముందు గంతల గురించి చెప్పనక్కరలేదు. 15రోజుల్లోనే ఎంతో చకటి సీసీ రోడ్డు నిర్మించిన్రు. మా బాధలన్నీ తీరినై. మాకు మంచి రోడ్డు సౌలత్ కల్పించిన టీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటం.
అడిగిన వెంటనే గంగుల స్పందించిండు..
చాలా రోజులుగా దుమ్ము, ధూళితో సూపర్‌బజార్ రోడ్డులోని మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. మా సమస్యలను మంత్రి గంగుల కమలాకర్‌కు చెప్పిన వెంటనే పెద్ద రోడ్డు మంజూరు చేసిన్రు. ఇప్పుడు తొందరతొందరగా రోడ్డు పనులు నడుస్తున్నయ్. సీసీ రోడ్డు పూర్తయితే మా బాధలు తప్పుతయ్.
గతంలో ఎవరూ పట్టించుకోలేదు
మా వాడలో సీసీ రోడ్డు లేక వానకాలంలో బురదతో రోడ్డు నిండిపోయేది. అందులో నీళ్లు నిలువడంతో నడువడానికి కష్టమయ్యేది. గతంలో ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. మొన్న మంత్రి గంగుల కమలాకర్‌కు మా సమస్యలు చెప్పిన వెంటనే స్పందించి డబ్బులు కేటాయించిండు. రోడ్డు కూడా పూర్తయింది. సమస్యను పరిషరించిన మంత్రికి కృతజ్ఞతలు.
-సాథిరి తిరుమల, గృహిణి, 22వ వార్డు
మా పాలిట దేవుడు కేసీఆర్
దళితబంధు ఇచ్చి మా అభివృద్ధికి ఆసరా అవుతున్న సీఎం కేసీఆర్ సార్ మా పాలిట దేవుడు. మనస్ఫూర్తిగా మేమంతా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నం. ఈ ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగాలని కోరు కుంటున్నం. కొందరు దళిత బంధుపై ఇష్టారీతిగా మాట్లాడుతున్నరు. సమాజంలో వెనుకబడిన దళితులకు ఈ పథకం పెడితే ఓర్వలేకపోతున్నరు. కేసీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటం. వచ్చే బై ఎలక్షన్లో టీఆర్ఎస్కు ఓటేసి రుణం తీర్చుకుంటం.
దళితులకు నిజమైన బంధువు
కడు పేదరికంలో మగ్గుతున్న దళితుల కోసం కేసీఆర్ సార్ దళితబంధు పథకం తెచ్చిండు. మాకు చాలా సంతోషంగా ఉంది. దళితులను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్న పార్టీలు మమ్మల్ని పట్టించుకోలేదు. దళితులను పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్‌కు మేమంతా రుణపడి ఉంటం. దళితుల పక్షపాతి, నిజమైన దళితబాంధవుడు కేసీఆర్ సార్. వచ్చే ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఓట్లు వేసి గెలిపించు కుంటం. కేసీఆర్ సార్ రుణం కొంతైనా తీర్చుకుంటం.
-కొలుగూరి సమ్మయ్య, దినసరి కూలీ, మామిళ్లవాడ( హుజూరాబాద్‌టౌన్)
టీఆర్ఎస్ను తప్పకుండా గెలిపించుకుంటం
మాకు ఎంతో మేలు చేసిన సీఎం కేసీఆర్ వెంటే ఉంటం. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయం. భవిష్యత్‌లో మాకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తడనే నమ్మకముంది. ఆయన పేదలపాలిట దేవుడు. హుజూరాబాద్‌లో ఆయన నిలబెట్టిన గెల్లు శ్రీనివాస్‌ను తప్పకుండా గెలిపించుకుంటం.
ఓటేసి రుణం తీర్చుకుంటం
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ మంచిగున్నయ్. ముఖ్యంగా మాలాంటి రైతుల కోసం ఎన్నో పథకాలు తెచ్చిండు. దళితుల అభివృద్ధికి ఇప్పుడు దళితబంధు అమలు చేస్తున్నడు. వచ్చే బై ఎలక్షన్లో టీఆర్ఎస్కే ఓటేసి కేసీఆర్ సార్ రుణం తీర్చుకుంటం.
-మోహన్‌రెడ్డి, శివునిపల్లి, కమలాపూర్ మండలం
ఎవరూ అడగకున్నా దళిత బంధు ఇస్తున్నరు
సీఎం కేసీఆర్ గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాల కన్నా రెండింతలు ఎక్కువగా అమలు చేస్తున్నడు. అన్ని వర్గాల ప్రజలకు వర్తింపజేయడం గొప్పవిషయం. అడగకుండానే దళిత బంధు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు దళిత జాతి యావత్ రుణపడి ఉంటుంది. ఓటు ద్వారా కృతజ్ఞత తెలుపుతది.
-పోచంపల్లి సదయ్య, హమాలీ, పెద్ద పాపయ్యపల్లి (హుజూరాబాద్ టౌన్)
టీఆర్ఎస్ వెంటే ఉంటం
తెలంగాణ ఉద్యమంలో రజకుల పాత్రను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ ధోబీఘాట్లకు 250 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా ఇస్తున్నడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రజకులంతా సుఖ సం తోషాలతో ఉన్నారు. హుజూరాబాద్ ఉన్న ఎన్నికలో టీఆర్ఎస్ వెంటే ఉండి గెలిపించుకుంటం.
-కొండపాక శ్రీనివాస్, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(హుజూరాబాద్)