కరీంనగర్ రూరల్, మే 5: యాసంగి వరి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించి, రైతు పక్షపాతిగా నిలిచారని కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుబ్బపల్లి, ఫకీర్‌పేట, జూబ్లీనగర్, తీగలగుట్టపల్లి గ్రామాల్లో కరీంనగర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సీఎం కేసీఆర్ రూ. 3 వేల కోట్ల బడ్జెట్ విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అవసరమైన గన్నీ సంచులను తెప్పించి, ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూస్తున్నారని పేర్కొన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర రూ. 1960 పొందాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు.
కరీంనగర్ పీఏసీఎస్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, ఇందుకు సహకరించిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్బీఎస్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినా రాష్ట్ర ప్రభుత్వం సహసోపేత నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సింగిల్ విండో సీఈవో రమేశ్, కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఆంజనేయులు, డైరెక్టర్ సాయిల మహేందర్, దుబ్బపల్లిలో సర్పంచ్ దుర్గ, రమేశ్, రంగారెడ్డి, ఫకీర్‌పేటలో నందయ్య, జూబ్లీనగర్‌లో భారతి, ఎంపీటీసీ చల్ల రామక్క, రాములు, చల్ల లింగారెడ్డి, మునిరెడ్డి, సంతోష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
కొత్తపల్లి, మే 5: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పేర్కొన్నారు. కొత్తపల్లిలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఫక్రొద్దీన్, కౌన్సిలర్లు గండు రాంబాబు, చింతల సత్యనారాయణరెడ్డి, ఏఏవో రాము, ఆర్ఐ నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు బండ గోపాల్‌రెడ్డి, ఎస్కే బాబా, జెర్రిపోతుల శ్రీకాంత్, ఎస్కే మున్వర్‌ఖాన్, రైతు సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.