రాజన్న సిరిసిల్ల, మే 5 (నమస్తే తెలంగాణ): అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సమీకృత కలెక్టర్టేట్లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఈ హెల్త్ ప్రొఫైల్, గర్భిణుల నమోదు, వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇష్టారీతిన ఆపరేషన్లు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆపరేషన్లు చేయడంతో తల్లీబిడ్డల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. ఆపరేషన్లు తగ్గించి, వంద శాతం సాధారణ ప్రసవాలను పెం చేలా ఆరోగ్యశాఖ అధికారులు నిత్యం దవాఖానలను తనిఖీ చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చే రోజే రక్తహీనత కేసులపై దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేయగా, అనువైన స్థలాన్ని గుర్తించాలని ఆర్డీవో శ్రీనివాసరావును ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బీ సత్యప్రసాద్, వైద్యాధికారులు సుమన్‌మోహన్‌రావు, శ్రీరాములు, దవాఖానల సూపరిండెండెంట్లు మురళీధర్‌రావు, మహేశ్రా వు, సర్వేలైన్స్ అధికారి మీనాక్షి, మహేశ్ ఉన్నారు.
యూనిట్ గ్రౌండింగ్ పూర్తి చేయాలి
దళితబంధు లబ్ధిదారులకు కేటాయించిన యూనిట్ల గ్రౌండింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. యూ నిట్ల గ్రౌండింగ్‌పై అధికారులతో ఆయన సమీక్షించారు. ఇప్పటికే యూనిట్లను గ్రౌండింగ్‌కు ఏర్పా ట్లు చేసుకుంటున్న లబ్ధిదారులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పురోగతిని పరిశీలించి విడుతల వారీగా నిధులను మంజూరు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈఈ వినోద్‌కుమార్, డీఆర్డీవో మదన్మోహన్, పరిశ్రమల అధికారి ఉపేందర్, పశు సంవర్ధక శాఖ అధికారి కొమురయ్య తదితరులు ఉన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
సిరిసిల్ల టౌన్, మే 5: మినీ స్టేడియం, కొత్త చెరువు సుందరీకరణ పనుల్లో వేగం పెంచి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయం తి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయ న జయప్రకాశ్‌నగర్‌లోని మినీ స్టేడియం, 26వ వార్డులోని కొత్త చెరువు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మాట్లాడారు. పట్టణ ప్రజ లు ఉల్లాసంగా గడిపేందుకు అనువైన స్థలంగా కొత్త చెరువు రూపుదిద్దుకుంటున్నదని తెలిపారు. అదేవిధంగా రూ.3కోట్లతో నాలుగెకరాల్లో మినీ స్టేడియం పనులు జరుగుతున్నాయని చెప్పారు. పెండింగ్‌లో పనులన్నింటినీ పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఇక్కడ అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తదితరులు ఉన్నారు.
ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి
వేములవాడ, మే 5: మున్సిపల్ పరిధిలో ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలని కలెక్టర్ అనురాగ్‌జయంతి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వేములవాడ పట్టణంలో ని నంది కమాన్, అయ్యోర్‌పల్లి, జగిత్యాల రహదారి, మల్లారం రహదారుల వెంబడి మొక్కలను పరిశీలించి, మాట్లాడారు. మున్సిపాలిటీలో ప్రణాళికాబద్ధంగా పచ్చదనాన్ని పెం పొందించాలని సూ చించారు. ఖాళీ స్థలాలను గుర్తించి వీలైనన్నీ ఎక్కువగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కల ను సంరక్షించేందుకు గానూ వారంలో కనీసం రెండు లేదా మూడుసార్లు నీటిని అందించాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్‌సుందర్‌రావు, టీపీవో శ్రీధర్ తదితరులు ఉన్నారు.