హుజూరాబాద్‌టౌన్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆదివారం నియోజకవర్గంలో ఘనంగా జరుపుకొన్నారు. పంచాయతీల్లో సర్పంచులు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రవీందర్‌రెడ్డి, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ వెంకట్‌రెడ్డి, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ కిరణ్, సబ్‌జైలులో జైలర్ ఉపేందర్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య అధ్యక్షుడు తాడికల్ శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, వందనం చేశారు.
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 15: హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గందె రాధిక, మున్సిపల్ లేబర్ కార్యాలయం వద్ద వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల జాతీయ జెండా ఎగురవేశారు. కార్మికశాఖ కార్యాలయం వద్ద ఏఎల్వో వెంగమాంబ, పోలీస్‌స్టేషన్‌లో టౌన్ సీఐ వీ శ్రీనివాస్, తహసీల్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రాంరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. ఏరియా దవాఖానలో సూపరింటెండెంట్ రమేశ్, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్పర్సన్ బర్మావత్ రమాదేవి, హుజూరాబాద్ కోర్టులో జడ్జి రాధిక, ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ దోమ ఆదిరెడ్డి, ఎంవీఐ సిరాజ్ఉర్హ్మ్రన్, ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఏసీడీపీవో భాగ్య, ఆర్టీసీ డిపో మేనేజర్ రజినీకృష్ణ, సబ్‌రిజిస్ట్రార్ మక్సుద్ అలీ, బీఎస్ఎన్ఎల్ డీఈ విజయభాస్కర్‌రెడ్డి, వెటర్నరి ఏడీఏ శ్రీనివాస్, జైలర్ ఉపేందర్‌రావు, ఎన్పీడీసీఎల్ డీఈ వాసుదేవ్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో డాక్టర్ స్వాతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల భూమిరెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. టీఆర్ఎస్ కార్యాలయం వద్ద పార్టీ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యాలయం వద్ద అధ్యక్షుడు కిరణ్, బీజేపీ కార్యాలయం వద్ద అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, సీఐటీయూ కార్యాలయం వద్ద అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ మువ్వన్నెల జెండా ఎగురవేసి, వందనం సమర్పించారు.
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 15: మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఇరుమల్ల రాణి, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు జాతీయ జెండా ఎగురవేశారు. తుమ్మనపల్లి, హుజూరాబాద్, జూపాక సింగిల్ విండో కార్యాలయాల్లో చైర్మన్లు కౌరు సుగుణాకర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. సింగాపూర్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ కందుకూరి శంకర్, చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి రమాదేవి, పొదుపు సంఘాల్లో అధ్యక్షులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు.
జమ్మికుంట/ జమ్మికుంట రూరల్, ఆగస్టు 15: మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ రాజేశ్వర్‌రావు, తహసీల్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ రాజారెడ్డి, మండల ప్రజాపరిషత్‌లో ఎంపీపీ మమత, పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్‌హెచ్‌వో మౌనిక జాతీయ జెండా ఎగురవేశారు. మార్కెట్ కమిటీ యార్డులో చైర్మన్ బాలకిషన్‌రావు, కేవీకేలో వెంకటేశ్వర్రావు, తదితర కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, వందనం చేశారు. మున్సిపల్ చైర్మన్ సిబ్బందికి చద్దర్లు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట, ఆగస్టు 15: తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సురేఖ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పావని, పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ తిరుపతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇల్లందకుంట దేవస్థానంలో ఈవో సుధాకర్, ప్రభుత్వ దవాఖానలో వైద్యురాలు శ్రీదేవి, వ్యవసాయ కార్యాలయంలో ఏవో రజిత, సొసైటీలో అందాల కొమురెల్లి, అన్ని గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేసి, స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.
సైదాపూర్, ఆగస్టు 15: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సదానందం, పోలీస్‌స్టేషన్‌లో ప్రొబేషనరీ ఎస్ఐ అకల తిరుపతి జాతీయ జెండా ఎగురవేశారు. సింగిల్ విండో కార్యాలయాల్లో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ కార్యాలయం వద్ద పార్టీ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, ఆయా గ్రామాల్లో సర్పంచులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, వందనం చేశారు.
వీణవంక, ఆగస్టు 15: మండల దివ్యాంగుల కార్యాలయంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సరిత, మండల పరిషత్‌లో ఎంపీపీ ముసిపట్ల రేణుక, పోలీస్ స్టేషన్లో ఎస్‌హెచ్‌వో శ్రావణ్‌కుమార్ జాతీయ జెండా ఎగురవేశారు. సొసైటీలో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, గ్రంథాలయంలో మంజూలత, ఆటోస్టాండ్ వద్ద ఎస్ఐ కిరణ్‌రెడ్డి, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జెండాను ఆవిష్కరించి, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, నాయకులు ముసిపట్ల తిరుపతి రెడ్డి, మాడ సాధవరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.