జమ్మికుంట రూరల్/వీణవంక, ఆగస్టు 15: టీఆర్ఎస్లో చేరికల జోష్ కొనసాగుతున్నది. ఆదివారం జమ్మికుంట, వీణవంక మండలాల్లో పలువురు పార్టీలో చేరారు. వీరికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పార్టీ కండువాలు వేసి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జమ్మికుంట మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామ తాపీ మేస్త్రీల సం ఘం సభ్యులు 80మంది ఎమ్మెల్యే అరూరి సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారిలో తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్షుడు సమ్మయ్య, ఉపాధ్యక్షుడు సంపత్, కోశాధికారి నర్సింగరావు, పెద రాజు, తదితరులున్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గం నుంచే దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్న శుభతరుణంలో జమ్మికుంట మండలంలోని ప్రతి గ్రామం నుంచి దళితులు, ప్రజలు అత్యధికంగా పాల్గొని మద్దతు తెలుపాలన్నారు. రాష్ట్ర నాయకుడు శ్రీధర్‌రెడ్డి, వరంగల్ డీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఎంపీపీ మమత, జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన శాలివాహన సంఘం గ్రామశాఖ అధ్యక్షడు సిలివేరు సమ్మయ్యతో పాటు మరో 10 మంది బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నూతనంగా పార్టీలో చేరినవారందరూ టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. పీఏసీఎస్ మాజీ చైర్మన్ మాడ సాదవరెడ్డి, నాయకులు మ్యాక వీరయ్య, నల్ల తిరుపతిరెడ్డి, లకోట రాజవీరు, బాబురావు, గెల్లు రమేశ్, భా స్కర్‌రెడ్డి, నర్సింగరావు, ఈదునూరి కుమార్, రాజయ్య, సంపత్, శంకర్ తదితరులున్నారు.