హుజురాబాద్ టౌన్, ఆగస్టు15: హుజూరాబాద్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశంసించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు జెండా ఆవిష్కరించారు. అనంతరం క్లబ్ ఆహ్వానం మేరకు వారు మర్యాదపూర్వకంగా సందర్శించి సభ్యులకు అందుతున్న సేవలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. క్లబ్‌లోని ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఇతర సౌకర్యాలను పరిశీలించి కార్పొరేట్ స్థాయిలో స్టేడియాల కన్నా ఇండోర్ స్టేడియం చాలా బాగుందని కొనియాడారు. ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ క్లబ్ ఎంతో మందికి పలురకాల సేవలందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు నెలవుగా మారడం అభినందనీయమన్నారు. క్లబ్ అభివృద్ధి కోసం ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామని పేరొన్నారు.
ఈ సందర్భంగా క్లబ్ నిర్వాహకులు మంత్రులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శాలువా కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావును క్లబ్ సభ్యులు సన్మానించి జ్ఞాపిలు అందజేశారు. కార్యక్రమంలో క్లబ్ నిర్వాహకులు వి.శ్రీనివాసరావు, పేరాల గోపాల్‌రావు, శ్రీరామ్‌రెడ్డి, కంకణాల తిరుపతిరెడ్డి, సేనారెడ్డి, కిషన్‌రెడ్డి, నారాయణరెడ్డి, తొగరు సదానందం, మోహన్‌రావు, చొల్లేటి కిషన్‌రెడ్డి, కె.భగవాన్‌రెడ్డి, విజయారెడ్డి, కొండ గణేశ్, ఎస్.వేణు, ఆడెపు సూర్యం, శ్రీనివాస్, రవి, చందాగాంధీ తదితరులు పాల్గొన్నారు.