చిగురుమామిడి, ఆగస్టు 15: సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌లోని శాలపల్లిలో దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికి సోమవారం వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మండలం నుంచి 4వేల మంది తరలివస్తారని ఎంపీపీ కొత్త వినీత, జడ్పీటీసీ గీకురు రవీందర్, టీఆర్ఎస్ నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి తెలిపారు. మండల కేంద్రంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. వెనుకబడిన దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. విలేకరుల సమావేశంలో ప్రజాప్రతినిధులు, నాయకులు రాజిరెడ్డి, వెంకటరమణారెడ్డి, మహేందర్‌రెడ్డి, రవి, లక్ష్మణ్, వెంకటేశం, తిరుపతి, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, అంజయ్య, సర్వర్ పాషా, కొమురయ్య, రాంబాబు, చంద్రయ్య, సది, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
సభను విజయవంతం చేయాలి
మానకొండూర్ రూరల్, ఆగస్టు 15: సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లగల్ల నగేశ్ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. అధికసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.