జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు
నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు
కార్పొరేషన్, ఏప్రిల్ 5: జిల్లా వ్యాప్తంగా మంగళవారం మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ బాబు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి మేయర్ వై సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ త్రియంభకేశ్వర్, శానిటేషన్ సూపర్వైజర్ రాజమనోహర్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
కార్పొరేషన్, ఏప్రిల్ 5: నగరంలోని 18, 19వ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణగౌడ్, ఎదుల్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు పిలుపునిచ్చారు. కొత్తపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రుద్ర రాజు మాట్లాడుతూ, దేశాభివృద్ధికి జగ్జీవన్‌రామ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, గున్నాల విజయ, ఎస్కే నజీయా, చింతల సత్యనారాయణరెడ్డి, గండు రాంబాబు, వేముల కవిత, కో-ఆప్షన్ సభ్యులు ఎస్కే షహనాజ్, మునావర్‌ఖాన్, కట్ల మమత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, ఏప్రిల్ 5: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఆర్ఎం ఖుస్రోషా ఖాన్, అధికారులు పూల మాలల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీవీఎం రవిశంకర్‌రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ లావణ్య, డిపో-1 మేనేజర్ భూపతిరెడ్డి, పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్య, స్టేషన్ మేనేజర్ నారాయణ, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.