ఆకట్టుకున్న విద్యార్థుల ఎగ్జిబిట్స్
సత్తా చాటిన ధర్మారం, మూలసాల విద్యార్థులు
రాష్ట్రస్థాయిలో మొదటి, ఐదు బహుమతులు కైవసం
అభినందించిన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి
పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ 2021-22’లో రాష్ట్రస్థాయి పోటీల్లో పె ద్దపల్లి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ధ ర్మారం ఆదర్శ, మూలసాల జల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులఎగ్జిబిట్స్ మొదటి, ఐదో స్థానాల్లో నిలిచాయి. గత సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఇన్నోవేషన్ చాలెంజ్‌లో ఆదర్శ పాఠశాల (ధర్మారం)కు చెందిన విద్యార్థులు బీ తమన్నా, జీ శివాని ‘ఎకో ఫ్రెండ్లీ మెడికల్ టైం టేబుల్ బ్యాగ్’, జడ్పీహెచ్ఎస్ (మూలసాల)కు చెందిన ఏ. అరవింద్‌రెడ్డి, కే లిఖిత్, కే శివకుమార్, కే అన్సూల్ ‘ఈ-టికెట్ ఫర్ బస్ ట్రావెల్స్’ ఎగ్జిబిట్స్‌తో అద్భుతమైన ప్రతిభ చూపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలు విద్యార్థుల ఎగ్జిబిట్స్ తిలకించి, అభినందించారు. మొదటి బహుమతి సా ధించిన ధర్మారం ఆదర్శ పాఠశాల విద్యార్థులకు రూ. 3 లక్షలు, ఐదో బహుమతి సాధించిన మూ లసాల జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రూ. ఒక లక్ష ప్రైజ్ మనీ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి చేతుల మీ దుగా చెక్కు అందజేశారు. అత్యుత్తమ ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఐటి శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఏ శ్రీదేవసేన, పలువురు యూనిసెఫ్ టీఎస్ఐసీ యువా, ఇన్క్విలాబ్ ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడ పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి బీ రవినందన్‌రావు, కే. శ్రీనివాస్, గైడ్ టీచర్లు సీ శివకృష్ణ, ఏ మమత, టీ. సంపత్‌కుమార్, విద్యార్థులు ఉన్నారు.