గంభీరావుపేట, ఏప్రిల్ 3: పుట్టిన 5 రోజుల నుంచి శ్వాస తీసుకోలేని స్థితితో ఉన్న పసి బాలు డి వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ పేద కుటుంబానికి రూ.3లక్షల 50 వేల ఎల్వోసీ అందజేసి అండగా నిలిచారు. మంత్రి కేటీఆర్ భరోసాతో పసి బాలుడికి హైదరాబాద్ కిమ్స్ వైద్యశాలలో వైద్యులు మె రుగైన చికిత్స అందించడంతో తమ బిడ్డకు వ్యాధి నయమయిందని తల్లిదండ్రులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన వంగ బాపురెడ్డి- అనూష దంపతులకు జన్మించిన బాబు పుట్టిన ఐదు రోజుల నుంచి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో ఆ బాబును కరీంనగర్లోని దవాఖానలో చూపించి అక్కడి నుంచి హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో పరీక్షలు చేయించారు. బాబు వై ద్యం కోసం లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు తెలుపడంతో ఆ దంపతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
ఈ క్రమంలో ఉప సర్పంచ్ అరుట్ల అం జిరెడ్డి ఫోన్ ద్వారా మంత్రి కేటీఆర్కు వారి పరిస్థితిని వివరించారు. దీంతో స్పందించిన అమాత్యుడు మెరుగైన వైద్య చికిత్సకు సాయం చేస్తానని భరోసా ఇవ్వడంతో వారు బాలుడిని వైద్యశాలలో చేర్పించారు. సు మారు 15 రోజుల వైద్య చికిత్స అనంతరం బాలుడికి వ్యాధి నయమైంది. వైద్య ఖర్చుల కోసం రూ. 3లక్షల50 వేల ఎల్వోసీ మంజూరు చేసి కేటీఆర్ అండగా నిలిచారు. బాలుడి తల్లిదండ్రులకు మం జూరైన ఎల్వోసీని ఆదివారం ఉప సర్పంచ్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు హన్మంతరెడ్డి అందజేశారు. బాబు వైద్యం కోసం అల్లాడుతున్న తమకు మంత్రి కేటీఆర్ సార్ అండగా నిలిచారని, ఎల్వోసీ మంజూ రు చేశారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని బాలుడి తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు.