మల్యాల, ఏప్రిల్ 3 : కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో సీజీఎఫ్ నిధులు రూ.2.50 కోట్లతో నిర్మించిన కార్యాలయ భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవి శంకర్ మాట్లాడుతూ ఆలయ పరిధిలో ఒకే ప్రదేశంలో ఆలయ కార్యాలయ భవనంతోపాటు అధికారుల వాహనాల పార్కింగ్, వేద పాఠశాల, వీవీఐపీలకు అత్యాధునిక సౌకర్యాలతో రెండు అతిథి గృహాలు నిర్మించామన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారి శేష వస్త్రంతో సతరించి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్, ఆలయ పాలకవర్గ చైర్మన్ తిరుక్కోవెల మారుతీస్వామి, జడ్పీటీసీ రామ్మోహన్రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల, సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, సహకార సంఘం అధ్యక్షులు సాగర్‌రావు, ముత్యాల రాంలింగారెడ్డి, ఆలయ పాలకవర్గ సభ్యులు రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లింగాగౌడ్, సతీశ్‌కుమార్, జున్ను సురేందర్, గంగయ్య, నర్సయ్య, యాదగిరి, కొంక నర్సయ్య, ప్రవీణ్, నాయకులు జనగం శ్రీనివాస్, కోటేశ్వర్రావు, మ్యాక లక్ష్మణ్, దేవరాజం, వంశీ, ఆలయ సిబ్బంది బుద్ది శ్రీనివాస్, శ్రీనివాస శర్మ, సునీల్, రాజేశ్వర్ రావు, సంపత్ పాల్గొన్నారు.