మానకొండూర్, ఏప్రిల్ 1: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పోటీల్లో పాల్గొనాలని సుడా చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మానకొండూర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ‘అంబేద్కర్ కింగ్స్ ప్రీమియర్ లీగ్’ నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి జీవీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడుతాయన్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి క్రికెట్ జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ నెల 1 నుంచి 14 వరకు టోర్నీ జరుగుతుందని చెప్పారు. విజేత జట్టుకు రూ. 15 వేల నగదు, ట్రోఫీ, రన్నరప్ జట్టుకు రూ. 7,500 నగదు, ట్రోఫీ అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, ఉపసర్పంచ్ నెల్లి మురళి, అంబేద్కర్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మోదుంపల్లి బాబు, ఉండింటి సత్యనారాయణ, టీఅర్ఎస్ నాయకులు గుర్రం కిరణ్‌గౌడ్, పిట్టల మధు, దండబోయిన శేఖర్, ఇస్కుల్ల ఆంజనేయులు, కోండ్ర వెంకటస్వామి, ప్రభాకర్, రామగిరి రాజు, టోర్నీ నిర్వాహకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం: జడ్పీటీసీ మాడుగుల
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చీమలకుంటపల్లిలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటన్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందుతున్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంప వెంకన్న, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్‌రెడ్డి, గూడెల్లి ఆంజనేయులు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బద్ధం తిరుపతిరెడ్డి, సర్పంచ్ కర్ర రేఖ, ఉప సర్పంచ్ జంగిటి ప్రకాశ్, క్రీడాకారులు పాల్గొన్నారు.