హుజూరాబాద్‌టౌన్, మార్చి 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హుజూరా బాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కేసీఆర్ మహిళా బంధు సంబురాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం మొదటి రోజు మహిళా ప్రజాప్రతినిధులు, నాయకురాళ్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలను టీఆర్ఎస్ నాయకులు గౌరవ పూర్వకంగా సన్మానించారు. అలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందిన మహిళలతోపాటు మహిళా ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ కటౌట్లకు రాఖీ కట్టి కృతజ్ఞతలు చాటారు. హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ కటౌట్‌కు బల్దియా చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, మహిళా ప్రజాప్రతినిధులు, మెప్మా సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు. మానవహారంగా ఏర్పడ్డారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలోని మహిళల్లో గతంలో ఎన్నడూ చూడని ఆత్మవిశ్వాసం ఇప్పుడు వెల్లివిరుస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులు అదృష్టంగా భావిస్తుండడం సీఎం కేసీఆర్ పాలనకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, పార్టీ సోషల్ మీడియా నాయకురాలు గొడిశాల పావని, మహిళా విభాగం అధ్యక్షురాలు కల్లెపల్లి రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బర్మావత్ రామాయాదగిరినాయక్, కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీలు, సీఆర్పీలు, ఆశ కార్యకర్తలు, స్థానిక మహిళలు, నాయకులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకుని ముందస్తుగా ఆదివారం ఆర్యవైశ్య సంఘం హుజూరాబాద్ పట్టణాధ్యక్షుడు పుల్లూరు శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో విశిష్ట మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక-శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. అనంతరం ఆమెకు కిరీటాన్ని అలంకరించి, పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలువాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు వెలగందుల విరుపాక్షలింగం, కార్యదర్శి బల్లు పున్నం, పాలకవర్గ సభ్యులు, యువజన సంఘ సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు పాల్గొన్నారు.
సైదాపూర్ మండలంలో..
మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో మహిళా బంధు సంబురాల్లో భాగంగా ఆశ కార్యకర్తలను శాలువాలతో సన్మానించారు. పలు గ్రామాల్లో మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాయిత రాములు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కాయిత రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట పట్టణంలోని 12వ వార్డులో కౌన్సిలర్ మొలుగు ప్రణీత ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ, మహిళల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం వివిధ శాఖల్లో పని చేస్తున్న మహిళలను సన్మానించారు. 19వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి ఆధ్వర్యంలో కేసీఆర్ మహిళా బంధు వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. మహిళలను సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్‌కుమార్, వార్డు కౌన్సిలర్లు కుతడి రాజయ్య, పిట్టల శ్వేత, నాయకులు మొలుగు దిలీప్, శ్రీను, రాజబాబు, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
వీణవంక మండలంలో..
మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కేసీఆర్ మహిళా బంధు సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా దేశాయిపల్లిలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహిళల కోసం అమలు చేస్తున్న బృహత్తర పథకాలు, కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు పోతుల నర్సయ్య, గంగాడి సౌజన్య-తిరుపతిరెడ్డి, పింగిళి కోమల్‌రెడ్డి, పర్లపెల్లి రమేశ్, మోరె సారయ్య, పొదిల జ్యోతి-రమేశ్, బండ సుజాత-కిషన్‌రెడ్డి, చదువు లక్ష్మి-మహేందర్‌రెడ్డి, కాంతారెడ్డి, ఎంపీటీసీలు, సింగిల్‌విండో డైరెక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.