మానకొండూర్ రూరల్, మార్చి 6: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం కేసీఆర్ మహిళాబంధు సంబురాలను ఊరూరా అట్టహాసంగా నిర్వహించారు. మానకొండూర్ మండలం ముంజంపల్లిలో సర్పంచ్ రామంచ గోపాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ పిట్టల కుమారస్వామి ఆధ్వర్యంలో పారిశుధ్య మహిళా కార్మికులు, మహిళా సంఘాల లీడర్లు, మహిళా వైద్య సిబ్బందిని శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వార్డు సభ్యులు దయ్యాల అనిల్, గోగూరి దామోదర్‌రెడ్డి, గాజర్ల రాధ, బత్తిని రమాదేవి, నాయకులు బాలెంకి మల్లేశం, నందగిరి మల్లయ్యచారి, కైరి రజిత, పంచాయతీ, వైద్య సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
చిగురుమామిడి మండలంలో..
మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మహిళలంతా మానవహారంగా ఏర్పడ్డారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టి స్వీట్లు పంపిణీ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళాబంధు సంబురాలను ఘనంగా నిర్వహించారు. కొండాపూర్‌లో సీఎం కేసీఆర్ విగ్రహానికి సర్పంచ్ పెద్దపెల్లి భవాని రాఖీ కట్టారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. పారిశుధ్య మహిళా కార్మికులు, స్వయం సహాయక సంఘాల మహిళలను శాలువాలతో సతరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు అందె సుజాత, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పీచు లీల, కానవేని పద్మ, అరుణ, దొడ్ల విజయ, కొత్తూరు సంధ్య, మామిడి రాజేశ్వరి, కొమ్ము సమ్మయ్య, గీట్ల తిరుపతిరెడ్డి, చెప్యాల మమత, కొమ్మెర మంజుల, మామిడి అంజయ్య, జంగా వెంకటరమణారెడ్డి, కరివేద మహేందర్‌రెడ్డి, స్వప్న, పద్మ, ప్రవీణ్, వెంకటేశం, రవి, కిషన్‌రెడ్డి, సిరాజ్, రమేశ్, వెంకటరెడ్డి, మల్లే శం, తిరుపతి, సదానందం, సర్వర్‌పాషా, రాంబా బు, అరుణ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, వేణు, సత్యనారాయణ, శరబంధరెడ్డి, రాజమల్లు ఉన్నారు.
గన్నేరువరం మండలంలో..
గన్నేరువరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలోని మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి జడ్పీ హైస్కూల్ వరకు ర్యాలీ తీశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీ కట్టారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కుసుంబ నవీన, గూడెల్లి తిరుపతి, గంప వెంకన్న, తీగల మోహన్‌రెడ్డి, పుల్లెల లక్ష్మి-లక్ష్మణ్, న్యాత స్వప్న-సుధాకర్, బద్ధం తిరుపతిరెడ్డి, ఏవో కిరణ్మయి, ఏపీఎం లావణ్య, అటికం శారద, గంప మల్లీశ్వరి, కర్ర రేఖ, ఎంపీటీసీ బొడ్డు పుష్పలత, నాయకులు వెంకటేశ్వర్లు, వెంకటరమణారెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, సురేశ్, రాముగౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.