కార్పొరేషన్, మార్చి 6: మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. నరగంలో 59వ డివిజన్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా బంధు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను సన్మానించారు. ఈ సందర్భంగా జీవీఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంల జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని మహిళలంతా అండగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు.
మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్‌కు కటౌట్‌కు మహిళలు రాఖీలు కట్టారు. కార్పొరేటర్లు గందె మాధవి-మహేశ్, వాల రమణారావు, మహిళా నాయకురాళ్లు, ప్రజలు పాల్గొన్నారు. 3వ డివిజన్ (కిసాన్‌నగర్)లో పారిశుధ్య మహిళా కార్మికులు, ఆశ వరర్లు, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లను కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ సన్మానించారు. కార్యక్రమంలో డివిజన్ మహిళలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే, 18, 19 డివిజన్లలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణాగౌడ్, ఎదుర్ల రాజశేఖర్ సన్మానించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలి
నగరంలోని 33వ డివిజన్లో గల క్యాంపు కార్యాలయం వద్ద వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 20 మంది మహిళలను మేయర్ వై సునీల్‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళ శక్తి మంతురాలైతే ఆ కుటుంబం ఎంతో బాగు పడుతుందన్నారు. మహిళలందరూ సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్ పేర్కొన్నారు. కమాన్‌పూర్‌లో నిర్వహించిన మహిళా బంధు సంబురాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ జినుక సంపత్, ఉప సర్పంచ్ మునీందర్, ఏఎన్ఎంలు శివకుమారి, అనిత, ఆశ వర్కర్లు భాగ్య, స్వరూప, అంగన్వాడీ టీచర్లు కళావతి, అనూష, సరళ, స్వరూప, భారతి, దేవకి, కనకలక్ష్మి, కళావతి, సుజాత, భాగ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే, కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మహిళా కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పారిశుధ్య కార్మికులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల సభ్యులు, వైద్యులను మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు సన్మానించారు. అనంతరం సీఎం కేసీఆర్ కటౌట్‌కు మహిళలు రాఖీలు కట్టారు. మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, జెర్రిపోతుల మొండయ్య, గున్నాల విజయ-రమేశ్, ఎస్కే నజీయా బాబా, చింతల సత్యనారాయణరెడ్డి, వేముల కవిత-శేఖర్, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ ఫక్రొద్దీన్, కట్ల మమత-సుధాకర్, ఎస్కే షహనాజ్మునావర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు చీరెల పంపిణీ
కుటుంబ బాధ్యతలతో పాటు విభిన్న రంగాల్లో మహిళలు సత్తాచాటుతుండడం అభినందనీయమని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పేర్కొన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి చీరెలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, కరోనా సమయంలో జిల్లా వైద్య, ఆరోగ్య, పారిశుధ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారని కొనియాడారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీరిని సత్కరించడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, మహిళల సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు గౌరవ సూచకంగా మూడు రోజుల పాటు మహిళా బంధు పేరిట కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మహిళలు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లకు మహిళలు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కార్పొరేటర్లు సరిళ్ల ప్రసాద్, మేచినేని వనజ-అశోక్‌రావు, జంగిలి సాగర్, కోటగిరి భూమాగౌడ్, సుడా డైరెక్టర్ షేక్ యూసుఫ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి
మహిళలు అవకాశాలను అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో రాణించాలని జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ సూచించారు. కరీంనగర్‌లోని మెడికవర్ దవాఖానలో మహిళా దినోత్సవం నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, ఇంటర్ విద్యాధికారి రాజ్యలక్ష్మితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ, కరోనా సమయంలో వైద్య సేవలందించిన వైద్యులను, సిబ్బందిని అభినందించారు. అనంతరం దవాఖాన యాజమాన్యం అతిథులను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. దవాఖాన అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు కిరణ్ కొండపాక, సాయిఫణిచంద్ర, శ్వేత, నాగరాజు, మహేశ్, అనిల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్సారార్ కళాశాలలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ సమన్వయ కేంద్రంలో ప్రాంతీయ సమన్వయ సంచాలకుడు డాక్టర్ ఇటిక్యాల రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, డాక్టర్ రాజశ్రీ, రచయిత వసంతను శాలువాలతో సన్మానించారు. అనంతరం రచయిత పత్తెం వసంత రచించిన ‘ఆలోచనకు రెక్కలు’ పుస్తకాన్ని ప్రాంతీయ సమన్వయ సంచాలకుడు ఇటిక్యాల రాజేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకుడు మెతుకు సత్యం, సిబ్బంది మహదేవ్, వీరస్వామి, మల్లయ్య, రమణ పాల్గొన్నారు.