పెగడపల్లి, మార్చి 6: నిరుపేద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు పడి పోలీస్ శాఖలో ఎస్ఐ జాబ్ సాధించి ఆదర్శంగా నిలుస్తున్నది చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన కొక్కుల శ్వేత. ప్రస్తుతం జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నది. శ్వేతది చాలా పేద కుటుంబం. తల్లి అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పని చేస్తుండగా, తండ్రి టైలర్. వీరికి ముగ్గురు సంతానం. పిల్లలను ఉ న్నంతలో కష్టపడి చదివించారు. ఇందులో శ్వేత బాల్యం నుంచే కష్ట పడి చదివింది. స్థానికంగా పదోతరగతి దాకా చదివింది. ఇంటర్, బీ టెక్, ఎంటెక్ కరీంనగర్లో పూర్తి చేసింది. తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూసి, ఉన్నతంగా ఎదుగాలనే ఆశయంతో కష్టపడి చదివి కోచిం గ్ లేకుండానే 2017లో పోలీస్‌శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధిం చింది. పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూ ఎంటెక్ పూర్తి చేసింది. 2019లో ఎస్ఐ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా, కష్టపడి చదివి జాబ్ సాధించింది. 2021లో శిక్షణ పూర్తి చేసుకోగా గత నవంబర్‌లో పెగడపల్లి ఎస్ఐగా మెదటి పోస్టింగ్ వచ్చింది.
సీఐ మాధవి స్ఫూర్తితో ఉద్యోగంలోకి..
పోలీస్‌శాఖలో ఉద్యోగం చేయాలని చిన్ననాటి నుంచే అనుకున్నప్పటికీ ఏదో మూలన కాస్త భయం ఉండే. అయితే నేను చొప్పదండిలో పదో తరగతి చదువుతున్న సమయంలో అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న పలువురు యువకులను అప్పటి ఎస్ఐ మాధవి మా ముందే చితక బాదడం నచ్చింది. అప్పుడే ఎస్ఐ కావాలని మనసులో బలంగా అనుకున్న. అమ్మా, నాన్నల సహకారంతో ఉద్యోగంలో చేరిన. ఈ జాబ్ ఎన్నో సవాళ్లతో కూడుకున్నప్పటికీ ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది సహకారంతో విజయవంతంగా రాణిస్తున్నా. పేదలకు పూర్తి న్యాయం చేయడంతో పాటు, మహిళలకు అన్యాయం జరుగకుండా చూస్తున్న.
– కొక్కుల శ్వేత, ఎస్ఐ, పెగడపల్లి.