గంగాధర, మార్చి 6: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పసిపాప నుంచి పండు ముసలి వరకు ఆత్మ బంధువుగా నిలిచారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండలంలోని మధురానగర్ చౌరస్తాలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, మహిళా సంఘం సభ్యులతో కలిసి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కటౌట్లతో ర్యాలీగా తరలివచ్చారు. చౌరస్తాలో మహిళలు మానవహారంగా ఏర్పడ్డారు. అంబేద్కర్ విగ్రహం వద్ద థాంక్యూ కేసీఆర్ ఆకారంలో మహిళలు నిల్చున్నారు. సీఎం కేసీఆర్ కటౌట్‌కు బొట్టు పెట్టి మహిళా ప్రజాప్రతినిధులు, మహిళలు రాఖీలు కట్టి మంగళహారతులు పట్టారు. ఎమ్మెల్యే రవిశంకర్‌కు మహిళలు రాఖీలు కట్టారు. కేసీఆర్ కటౌట్‌కు ఎమ్మెల్యే రవిశంకర్ పుష్పాభిషేకం చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మధురానగర్ చౌరస్తా పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆడ పిల్ల పుట్టినప్పటి నుంచి మొదలు వృద్ధురాలి వరకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీలు శ్రీరాం మధుకర్, మెన్నేని స్వర్ణలత, చిలుక రవీందర్, జడ్పీటీసీలు పుల్కం అనురాధ, పునుగోటి ప్రశాంతి, మాచర్ల సౌజన్య, కొండపల్కల రామ్మోహన్రావు, సింగిల్ విండో చైర్మన్లు వెలిచాల తిర్మల్‌రావు, దూలం బాలాగౌడ్, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ పుల్కం గంగన్న, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు పుల్కం నర్సయ్య, ఉప్పుల గంగాధర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, గంట్ల జితేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్లు వేముల భాస్కర్, తాళ్ల సురేశ్, సర్పంచులు వేముల లావణ్య, మడ్లపెల్లి గంగాధర్, కంకణాల విజేందర్‌రెడ్డి, ఆకుల శంకరయ్య, ఎండీ నజీర్, మాల చంద్రయ్య, ముక్కెర మల్లేశం, రాసూరి మల్లేశం, జోగు లక్ష్మీరాజం, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు వేముల అంజి, కోల లింగారెడ్డి, గర్వందుల పరశురాములు, సామంతుల శ్రీనివాస్, పెంచాల చందు, నిమ్మనవేణి ప్రభాకర్, వినోద్ పాల్గొన్నారు.
మహిళాభివృద్ధే కేసీఆర్ ధ్యేయం
మహిళల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశాల మేరకు పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ కటౌట్‌కు మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టి, మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మహిళా ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ కటౌట్‌కు రాఖీలు కట్టారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఐకేపీ, మెప్మా సిబ్బందిని జడ్పీటీసీ, మున్సిపల్ చైర్పర్సన్ సన్మానించారు. ఈసందర్భంగా కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు గడ్డం చుక్కారెడ్డి, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్లు గన్ను శ్రీనివాస్ రెడ్డి, గొల్లపెల్లి శ్రావణ్‌కుమార్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ వెల్మ నాగిరెడ్డి, కో-ఆప్షన్ పాషా, కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్, కొత్తూరి స్వతంత్రభారతీనరేశ్, మాడూరి శ్రీనివాస్, దండె జమున-కృష్ణ, మహేశుని సంధ్య-మల్లేశం, మాజీ ఎంపీపీ వొల్లాల కృష్ణహరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు భూమారెడ్డి, మామిడి రాజేశం, తిరుపతిరెడ్డి, మునిగాల నారాయణ, గాండ్ల లక్ష్మణ్, తోడేటి డేవిడ్, ఆనంద కొమురయ్య, దండె రాజయ్య, మావురం మహేశ్, యశోద రాజయ్య, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఐకేపీ, మెప్మా సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, మార్చి 6: మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా అధ్యక్షతన కేసీఆర్ మహిళా బంధు కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథిగా సర్పంచ్ పంజాల ప్రమీల హాజరై ముఖ్యమంత్రి కటౌట్‌కు రాఖీ కట్టారు. మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకొన్నారు. మహిళా దినోత్సవాన్ని మూడు రోజులు జరుపుకోవాలని సూచించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ థాంక్యూ కేసీఆర్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. ఇందులో భాగంగా బస్టాండ్ కూడలిలో పారిశుధ్య కార్మికులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో ఏపీఎం ప్రభాకర్, మాజీ సర్పంచ్ జగన్మోహన్గౌడ్, సీహెచ్‌వో నారాయణ, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, మార్చి 6: కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్‌లో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు కేక్ కట్ చేసి, సీఎం కేసీఆర్ కటౌట్‌కు రాఖీలు కట్టారు. ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కూర శ్యాంసుందర్ రెడ్డి, మండలాధ్యక్షుడు, సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, సర్పంచులు దబ్బెట రమణారెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, ఎంపీటీసీ బుర్ర తిరుపతి ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘం సభ్యులను శాలువాలతో సన్మానించారు. కాగా, గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరున తాను పదవిలో ఉన్నంత కాలం రూ. 5,116 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి తెలిపారు. మహిళా దినోత్సవం నుంచి గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ వివరాలను అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు ఇవ్వాలని కోరారు. చామనపల్లిలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ బోగొండ లక్ష్మి-ఐలయ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు కేసీఆర్ కటౌట్‌కు రాఖీలు కట్టారు. అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఆయాలు, మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు.
ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్, గుర్రం ఆంజనేయులు పాల్గొన్నారు. దుర్శేడ్‌లో ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్రీరామోజు తిరుపతి ఆధ్వర్యంలో మహిళలు కేసీఆర్ కటౌట్‌కు రాఖీలు కట్టారు. ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. వార్డు సభ్యులు సుజాత, రాజ్‌కమల్, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చేగుర్తిలో సర్పంచ్ చామనపల్లి అరుణ-రాజయ్య ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికురాలు కల్లెపెల్లి రాజేశ్వరీ, అంగన్వాడీ టీచర్ చంద్రకళ, ఏఎన్ఎం అమృత, వీవో అధ్యక్షురాలు నాగశ్రీని శాలువాలతో సన్మానించారు. ఉపసర్పంచ్ గాండ్ల విజయ, సింగిల్ విండో డైరెక్టర్ అంజయ్య, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ కార్యకర్తలు మారం కొమురయ్య, మధు, శ్రీనివాస్ పాల్గొన్నారు. మొగ్దుంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ జక్కం నర్సయ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు సీఎం కేసీఆర్ కటౌట్‌కు రాఖీలు కట్టారు. మహిళా సంఘాల సభ్యులు, కందుల రమేశ్ గౌడ్, అంజిరెడ్డి, లక్ష్మణ్, లచ్చయ్య పాల్గొన్నారు. జూబ్లీనగర్‌లో సర్పంచ్ రుద్ర భారతి ఆధ్వర్యంలో మహిళా సంఘ భవనంలో కేసీఆర్ కటౌట్‌కు రాఖీలు కట్టి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లను సన్మానించారు.