హుజూరాబాద్‌టౌన్,మార్చి 3: టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ములేకే బీజేపీ నాయకులు హత్యా రాజకీయాలకు తెరలేపారని టీఆర్ఎస్వై జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖలీద్ హుస్సేన్ ధ్వజమెత్తా రు. గురువారం హుజురాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో సుభిక్షంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కిరాయి మూకలతో మట్టుబెట్టేందుకు రూ.12 కోట్ల సు పారీ ఇవ్వడం దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. వీరికి ఆ పార్టీ సీనియర్ నాయకులు జితేందర్రేడ్డి, డీకే అరుణ సహకరించడం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. ఇప్పటికైనా అరాచకాలకు స్వస్తిచెప్పాలని, లేదంటే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ 15వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్పటేల్, నేతలు చంద్రశేఖర్, సంపత్‌రెడ్డి, అంగడి సాయి, చింతల ఓంరాజ్, ఎడ్ల సంజీవ్, గూడ వెంకటేశ్, శ్రీనివాస్, అనిల్, సద్దాం పాల్గొన్నారు.
కుట్రపై గౌడ సంఘాల ఖండన
మంత్రి శ్రీనివాస్‌ను హత్య చేయించేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుట్రలు చేయడాన్ని హుజూరాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, కెకెర్ల సారయ్యగౌడ్, పంజాల హరీశ్‌గౌడ్ ఖండించారు. గురువారం హుజూరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. శ్రీనివాస్‌గౌడ్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకే అంతమొందించాలని చూడడం బాధాకరమన్నారు. గౌడ కులానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్ జోలికివస్తే సహించబోమని బీజేపీ నాయకులను హెచ్చరించారు. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
కఠినంగా శిక్షించాలి..
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హ త్యకు కుట్ర పన్నిన వారిని కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమరాపు రాజ య్య, ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఎంతటి స్థా యిలో ఉన్న నాయకులైనా సరే వదిలిపెట్టవద్దని చెప్పారు.