ధర్మపురి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లోని ఆలయాల సందర్శన
సతీసమేతంగా ప్రత్యేక పూజలు
పెగడపల్లి రాజన్న ఆలయంలో కోడె మొక్కు
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
ధర్మపురి/ పెగడపల్లి/ వెల్గటూర్ మార్చి 1: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం సతీసమేతంగా మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సతీమణి స్నేహలతతో కలిసి ధర్మపురి, పెగడపల్లి, వెల్గటూర్ మండలంలోని పలు ఆలయాలను దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ధర్మపురి అక్కెపల్లి రాజేశ్వరాలయం, శ్రీ సాంబశివ, పెగడపల్లిలోని స్వయంభూవు శ్రీరాజరాజేశ్వరస్వామి, వెంగళాయిపేట శివ, ఆంజనేయస్వామి, దేవికొండ గట్టు మల్లికార్జున స్వామి, వెల్గటూరులోని రాజరాజేశ్వరస్వామి, కోటేశ్వరస్వామి, ధర్మారం మండలం నంది మేడారంలోని శ్రీ అమరేశ్వరాలయం, రచ్చపల్లిలోని శ్రీ సాంబమూర్తి ఆలయాలను సతీమణి స్నేహలతతో కలిసి దర్శించుకున్నారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాలకు చేరుకున్న మంత్రి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో, స్థానిక నాయకులు, ఆలయ కమిటీల బాధ్యులు సాదర స్వాగతం పలికారు. పెగడపల్లి రాజన్న ఆలయంలో కోడెను కట్టేసి మొక్కు చెల్లించుకున్నారు.
అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఆయాచోట్ల అమాత్యుడు మాట్లాడుతూ పెగడపల్లి రాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, నంచర్ల రామాలయంలో గాలి గోపురం నిర్మాణానికి రూ. 50 లక్షల చొప్పున మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. ఆయా ధర్మపురిలో నేరెళ్ల, గోవిందుపల్లి సర్పంచులు పలిగిరి వసుందర, పురంశెట్టి రెడ్డి, ఎంపీటీసీ రెడ్డవేని సత్యం, ధర్మపురి పీఏసీఎస్ వైస్ చైర్మన్ శేర్ల రాజేశం, నాయకులు అక్కనపెల్లి బాబు, జాజాల రమేశ్, పెగడపల్లిలో జడ్పీటీసీ రాజేందర్రావు, ఎంపీపీ శోభాసురేందర్రెడ్డి, సర్పంచులు మేర్గు శ్రీనివాస్, గాజుల రాకేశ్, చిందం సులోచన-తిరుపతి, గొర్రె భాగ్యలక్ష్మి-ప్రశాంత్, రాజేశ్వర్‌రావు, లక్ష్మణ్, బాబుస్వామి, ఏఎంసీ చైర్మన్ తిరుపతినాయక్, వైస్ ఎంపీపీ గంగాధర్, విండో చైర్మన్లు కర్ర భాస్కర్‌రెడ్డి, మంత్రి వేణుగోపాల్, ఎంపీటీసీ జమున-స్వామి, ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గంగారెడ్డి, ప్రశాంత్, నేతలు నారెడ్డి రాజిరెడ్డి, గాజుల గంగమల్లేశం, కరుణాకర్‌రావు, సురేందర్‌రావు, శ్రీనివాసరావు, మోహన్‌రెడ్డి, ఆనం దం, సత్యనారాయణ, గురిజల శ్రీనివాస్, దామోదర్, రాజశేఖర్‌రెడ్డి, సంజీవరెడ్డి, విజయ్‌యాదవ్, వెల్గటూరులోని కోటేశ్వర స్వామి ఆలయం వద్ద హర్షశ్రీ డిగ్రీ కళాశాల విద్యార్థులు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.