ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి
సెంట్రల్ లైటింగ్ సిస్టం ప్రారంభం
ఓదెల, మార్చి 1: గ్రామాలను సత్వరంగా అభివృద్ధి చేయాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉప్పరపల్లి గ్రామంలోని ప్రజల కోర్కె మేరకు ఎమ్మెల్యే ప్రత్యేక కృషితో శివగట్టు మల్లికార్జునస్వామి ఆలయం వద్ద చౌరస్తాలో సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేయించి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన వసతులు సమకూర్చడం జరుగుతుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. గ్రామీణ రహదారులను సీసీ రోడ్లుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సర్పంచ్ పల్లె ఓదెలు, ఎంపీటీసీ గోపు లావణ్య, మాజీ సర్పంచ్ కొప్పుల రవి, విండో మాజీ చైర్మన్ గోపు నారాయణరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, నాయకులు ఆకుల మహేందర్, మ్యాకల వెంకటేశ్, బైరి కుమార్, కొప్పుల రాజయ్య, దాసరి స్వామి, గోపు మనోజ్‌కుమార్, మహిత, దాసరి నర్సింహారెడ్డి, కనుకుంట్ల సాయిలు, వీరగోని రమేశ్‌గౌడ్, ఆంజనేయులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.