మానకొండూర్ రూరల్, మార్చి 23: మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ బుధవారం పలు గ్రామాల్లో పర్యటిస్తూ వీధుల్లో ఉన్న వారితో ముచ్చటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పచ్చునూర్లోని దళిత కాలనీలో వెళ్తుండగా ఇద్దరు వృద్ధురాళ్లు జాన్తు రాజమ్మ, జాన్తు ఎల్లమ్మలు ఇంటి ముందు కూర్చొని ము చ్చట్లు పెట్టుకుంటున్నారు. వెంటనే ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లారు. వారితోపాటు నేలపై కూ ర్చుని ఆప్యాయంగా పలుకరించారు. దాదాపు అర గంటకు పైగా మాట్లాడారు. అవ్వ టూ మంచిగున్నరా..? కొడుకులు ఎంత మంద వ్వ?, బిడ్డలెందరు, ఏంపని చేస్తుండ్రూ, పింఛన్ వస్తుందా? అంటూ వారి మంచి చెడులను తెలుసుకున్నారు. బిడ్డా మా సీఎం సారే పెద్ద కొడుకోలె పింఛన్ ఇస్తుండని, కడుపు నిండా తింటున్నమని, రంది లేకుండా ఉన్నమని వృద్ధురాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. పచ్చునూర్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రామంచ ప్రవీణ్ సోదరి ఇటీవల మృతి చెందగా, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, నాయకులు కొత్తూ రి జగన్ గౌడ్, మాధవరం దామోదర్ రావు, గోపగోని నరేందర్, బండారి శ్రీ నివాస్, బొయిని వెంకటేష్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, మంద రాజ్ కుమార్, పొ లవేని సంపత్, బూమరాజ్ శ్రీనివా స్, పార్నంది కిషన్, అజయ్, నల్లగొండ తి రుపతిగౌడ్, గ్రామస్తులు, మహిళలు, వి విధగ్రామాల నాయకులు పాల్గొన్నారు.