తిమ్మాపూర్ రూరల్, జూలై 22: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ భారీ కేకును కోసి కార్యకర్తలకు తినిపించారు. వినోద్‌కుమార్ రాష్ట్ర సాధనకు ఎంతగానో కృషి చేశారని, తనతో కలిసి చేసిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. ఆయన భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, నాయకులు కొత్త తిరుపతిరెడ్డి, అశోక్‌రెడ్డి, మేడి అంజయ్య, నాయిని వెంకట్‌రెడ్డి, పొన్నం అనిల్‌గౌడ్, జలపతి, శ్రీనివాస్‌రెడ్డి, తాజొద్దీన్, కన్నం కొమురయ్య, మాతంగి లక్ష్మణ్‌తో పాటు నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మానకొండూర్‌లో..
మానకొండూర్ రూరల్, జూలై 22: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదిన వేడుకలను శుక్రవారం మానకొండూర్ పల్లెమీద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ హాజరై, కేక్ కట్ చేసి, స్వీట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, రైతు బంధు సమితి కన్వీనర్ రామంచ గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ నెల్లి మురళి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు పిట్టల మధు, ఉప సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రేమిడి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, నామాల శ్రీనివాస్, గుర్రం కిరణ్ గౌడ్, నెల్లి శంకర్, పడాల శంకరయ్య, ఉండింటి శ్యాంసన్, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, పిండి సందీప్, అడప శ్రీనివాస్, పార్నంది కిషన్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శంకరపట్నంలో..
శంకరపట్నం, జూలై 22: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వినోద్ కుమార్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు కాటం వెంకటరమణారెడ్డి, కోండ్ర రాజయ్య, దాసారపు భద్రయ్య, బైరి తిరుపతి, ఎంపీటీసీలు పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, గాండ్ల తిరుపతయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ వీరస్వామి, ఉప సర్పంచ్ గజెల్లి హన్మంతు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు అంతం తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉమ్మెంతల సతీశ్‌రెడ్డి, మోత్కూరి సమ్మయ్య, పంజాల రాజయ్య, కల్లూరి పోచయ్య, బొజ్జ రవి, నెలవేని మహేశ్, కొయ్యడ రాజయ్య, ఆర్కే, కుమార్ యాదవ్, కుమార్, గాజుల మల్లయ్య, నాగయ్య, రాజనర్సయ్య, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
గన్నేరువరంలో..
గన్నేరువరం, జూలై 22: మండల కేంద్రంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ జన్మదినం సందర్భంగా సర్పంచ్ పుల్లెల లక్ష్మీలక్ష్మణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. స్వీట్లు పంచారు. కార్యక్రమంలో నాయకులు న్యాత సుధాకర్, బద్దం తిరుపతిరెడ్డి, గొల్లపెల్లి రవి, మీసాల ప్రభాకర్, బూర వెంకటేశ్వర్లు, కొట్టె భూమయ్య తదితరులు పాల్గొన్నారు.