-తాండూర్, ఫిబ్రవరి 21: సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపింది. దేశంలో ఎన్నో ప్రాంతాలకు వెలుగుజిలుగులనందిస్తున్న నల్లనేలపై సీఎం కేసీఆర్‌కు అమితమైన అభిమానం ఉంది. అందుకే కార్మికులు ఎన్నో ఏండ్ల పాటు ఎదురు చూసిన కారుణ్య నియామకాలకు అధికారంలోకి రాగానే పచ్చజెండా ఊపారు. ఆయన ఆదేశాల మేరకు యాజమాన్యం మెడికల్ బోర్డులను నిర్వహించి, ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించింది. రెండేళ్ల సర్వీస్ ఉండి, మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుడి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించి, అండగా నిలిచింది. బెల్లంపల్లి ఏరియాలో 37 మందికి కారుణ్య ఉద్యోగాలు కల్పించగా, ఆయా కుటుంబాల్లో సంతోషం నిండింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా, కార్మికుల సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపుతున్నారు. తనకు సింగరేణి అంటే ప్రత్యేక అభిమానం ఉందని ఎన్నో సభలు, అంతరంగిక సమావేశాల్లో కేసీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న తమ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటున్నాయని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏండ్ల కల అయిన కారుణ్య నియామకాల విషయంలో కేసీఆర్ తీసుకున్న శ్రద్ధ తో వేలాది కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నెలలో మూడు నుంచి నాలుగు సార్లు మెడికల్ బోర్డు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల సర్వీసు ఉన్న ప్రతి కార్మికుడు పిల్లలకు ఉద్యోగం కోసం కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు బెల్లంపల్లి ఏరియాలో దరఖాస్తులు చేసుకున్న వారికి ఈ ప్రాంతం పరిధిలో 37 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ కు టుంబాల్లో సంతోషం నిండింది.
ముఖ్యమంత్రి పుణ్యమే..
సింగరేణి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే. గతంలో ఆంధ్రా పెత్తనం అధికంగా ఉండేది. కేసీఆర్ వచ్చిన తర్వాత మన నిధులు, మన కొలువులు నినాదంతో తీసుకున్న చర్యల వల్ల నా లాంటి వారికి ఉద్యోగాలు వచ్చాయి. మా నాన్న సర్దార్‌గా పనిచేస్తూ ఆరోగ్యం సహకరించకపోవడంతో మెడికల్ ఇన్వాలిడేషన్ అ య్యారు. దీంతో నేను ఉద్యోగం కో సం దరఖాస్తు చేసుకున్నా. మా కుటుంబంలో నాతో పాటు ఒక అన్న, అక్క. అన్నయ్య కోరమాండల్ కంపెనీలో జోనల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాకు జీఎం సారు నియామకపత్రం అం దించడంతో ట్రైనింగ్ చేసి విధుల్లో చేరాను. సీఎం పుణ్యమా అని మాకు ఉద్యోగాలు తొందరగా వచ్చా యి. నా కుటుంబమంతా సంతో షంగా ఉన్నారంటే మళ్లీ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం కల్పించడమే. కేసీఆర్, ఈ ప్రభు త్వానికి, మా యాజమాన్యానికి ఎంతో రుణ పడి ఉంటాం.
జీవితాంతం రుణపడి ఉంటాం
మా నాన్న సపోర్టుమెన్‌గా గోలేటి 1 ఇం ైక్లెన్, కాసిపేట 1 గనిలో విధులు నిర్వర్తిం చారు. ఆయన అనారోగ్యంతో మెడికల్ అన్‌ఫిట్ అయ్యారు. మా కుటుంబంలో నేను, నాతో పాటు ఇద్దరు అక్కయ్యలు. నేనే చిన్నవాన్ని. 2018 డిసెంబర్లో దరఖాస్తు చేసుకున్నాం. కొద్ది నెలల్లోనే ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది. సింగరేణిలో ఉద్యోగం చేస్తానని కలలో కూడా ఊహించలేదు. సీ ఎం కేసీఆర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితక్క చొరవతో మా నాన్న ఉద్యోగం నాకు వచ్చింది. సింగరేణిలో నాకు అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా.
– కత్తెర్ల రవి, మాదారం టౌన్షిప్, బెల్లంపల్లి ఏరియా
చెప్పింది చేసే ముఖ్యమంత్రి..
మా నాన్న సింగరేణిలో ఉద్యోగం చేస్తుండగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ యన అన్‌ఫిట్ కావడంతో నేను ఉ ద్యో గం కోసం దరఖాస్తు చేసుకున్నా. నాకు ఉద్యోగం రావ డం చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక అన్న, అక్కా, చెల్లి ఉన్నారు. అన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గతంలో కారుణ్య నియామకాలకు సంబంధించి ఎంతో మంది నేతలు, సీఎంలు సైతం హామీలు ఇచ్చిన్రు. కానీ నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. కారుణ్య నియామకాలే కాకుండా, ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నారు. తెలంగాణ సర్కారు, సీఎం కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటా.
-సైదం చిరంజీవి, మందమర్రి