గంగాధర, ఫిబ్రవరి 13: కరోనా సంక్షోభంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని 50 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 16 లక్షల 89 వేల ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఆయన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేద, మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రవిశంకర్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్ల సురేశ్, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, శ్రీమల్ల మేఘరాజు, జోగు లక్ష్మీరాజం, ముక్కెర మల్లేశం, దోర్నాల హన్మంతరెడ్డి, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్‌రెడ్డి, కోలపురం లక్ష్మణ్, నాయకులు వేముల అంజి, వడ్లూరి ఆదిమల్లు, తోట మహిపాల్, తడిగొప్పుల రమేశ్, రేగుల తిరుపతి, సుంకె అనిల్, పెంచాల చందు, మ్యాక వినోద్, గంగాధర సంపత్, మామిడిపెల్లి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేత
నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని కొలిమికుంట గ్రామానికి చెందిన మధు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నిరుపేద కాగా, దవాఖానలో చికిత్స చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. కుటుంబసభ్యులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే రూ. లక్షా 25 వేల ఎల్వోసీ మంజూరు చేయించారు. కాగా, గంగాధర మండలం బూర్గుపల్లిలోని తన నివాసంలో ఆదివారం మధు కుటుంబసభ్యులకు ఎల్వోసీ అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన పేదలు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఎల్వోసీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు మధు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు గడ్డం చుక్కారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు తాళ్లపెల్లి శ్రీనివాస్‌గౌడ్, మల్యాల మహేందర్, సత్తు తిరుపతి, ఆకుల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.