సైదాపూర్, డిసెంబర్ 12: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసిల్ కార్యాలయంలో మండలంలోని 31 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 26 మంది లబ్ధిదారులకు రూ. 9 లక్షల 67 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. అలాగే, వెన్కేపల్లిలో రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందన్నారు. ప్రజల సౌకర్యం కోసమే తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ డీలర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ రావుల రవీందర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచులు కాయిత రాములు,
కొండ గణేశ్, బత్తుల కొమురయ్య, కొత్త రాజిరెడ్డి, ఆవునూరి పాపయ్య, బొడిగ పద్మజాకొమురయ్య, రేగుల సుమలత-అశోక్, ఎంపీటీసీలు బద్దిపడిగ అనితారవీందర్రెడ్డి, ఓదెలు, నాయకులు ముత్యాల వీరారెడ్డి, బెదరకోట రవీందర్, పెద్దపల్లి అరుణ్‌కుమార్, కంది రవీందర్‌రెడ్డి, చిట్టి ప్రకాశ్‌రెడ్డి, కనుకుంట్ల విజయ్‌కుమార్, ఏశిక ఐలయ్య, వర్నె మోహన్‌రావు, కొత్త మధుసూదన్‌రెడ్డి, పోతిరెడ్డి హరీశ్‌రావు, బత్తుల లక్ష్మీనారాయణ, దేవేంద్ర, స్వామి, సురేశ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.