మల్లాపూర్, డిసెంబర్ 9: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర పసలేదని, అసలు మీ పాదయాత్రలో రైతులను మోసం చేసి గెలిచిన అబద్ధాల ఎంపీ అ ర్వింద్ ఎక్కడా కనిపించడంలేదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాఘవపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధికోసమే బండి సంజయ్ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, బీజేపీ ఎంపీలు ఎన్ని నిధులు తీసుకువచ్చి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కోరుట్ల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని కొనియాడారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు పంట ఎక్కువగా సాగవుతుందని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పసుపు పంటకు ప్రత్యేక బోర్డు తీసుకొచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో స్పష్టంగా తెలుసని, రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. ఇక్కడ ఆర్బీఎస్ గ్రామ అధ్యక్షుడు దేశెట్టి నగేశ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ గురిజెల లక్ష్మీనారాయణ, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఉసికెల రాజేందర్, నాయకులు నత్తి నర్సయ్య, సొన్న మీనయ్య, గంగాధర్, భూమేశ్, నర్సయ్య, మనోజ్, వినోద్, దేవన్న, హరీశ్, స్వామి, లక్ష్మణ్ పాల్గొన్నారు.