హుజూరాబాద్‌టౌన్, డిసెంబర్ 9: రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్- స్వర్ణ దంపతుల కుమారుడు బండ సాయికుమార్ -సాహితి వివాహం వరంగల్ రోడ్డులోని మధువని గార్డెన్స్‌లో శుక్రవారం జరిగింది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు-సరోజినీదేవి దంపతులు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఆర్డీవో బీ హరీసింగ్, ఏసీపీ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు గందె రాధిక-శ్రీనివాస్, కమిషనర్ ఎస్ సమ్మయ్య, ఎంపీపీ దంపతులు ఇరుమల్ల రాణి -సురేందర్‌రెడ్డి, ప్రముఖ వ్యాపారి వర్ధినేని రవీందర్రావు దంపతులు తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.