రాయికల్, డిసెంబర్ 9: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే గర్భిణులు ప్రసవాలు చేయించుకునేలా చూడాలని జిల్లా మాతాశిశు సంరక్షణాధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. రాయికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. హా స్పిటల్‌లో ప్రసవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గర్భిణులు ప్రభుత్వ దవాఖానలో చెకప్ చేయించుకోవాలని సూచించారు.
గర్భిణుల్లో రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని పేరొన్నారు. ప్రతినెలా గర్భిణులకు గైనకాలజిస్ట్ ద్వారా చెకప్‌లు చేయించి, అన్ని పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. జాతీ య ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో సీహెచ్‌వో కే ప్రమీల, ఎంపీహెచ్‌ఈవో ఎం శ్రీనివాస్, సూపర్వైజర్లు టీ శ్రీధర్, బీ చంద్రకళ, ఆరోగ్యమిత్ర ఆంజనేయులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.