గంగాధర, డిసెంబర్ 9 : బీఆర్ఎస్ పార్టీని స్థాపించి సీఎం కేసీఆర్ దేశ చరిత్రలో సువర్ణాధ్యాయానికి నాంది పలికారని పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించిన సందర్భంగా మండలంలోని మధురానగర్ చౌరస్తాలో పార్టీ నాయకులు శుక్రవారం పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు వేముల దామోదర్, జోగు లక్ష్మీరాజం, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, నాయకులు ఆకుల మధుసూదన్, వేముల అంజి, రామిడి సురేందర్, తాళ్ల సురేశ్, జారతి సత్తయ్య, వేముల శ్రీధర్, సుంకె అనిల్, పెంచాల చందు, గుండవేని తిరుపతి, ఇరుగురాల రవి, మ్యాక వినోద్, మామిడిపెల్లి అఖిల్, గంగాధర వేణు, గంగాధర శ్రీకాంత్, ఈర్ల మహిపాల్, వెడవెల్లి ప్రవీణ్, గంగాధర మోహన్, జక్కుల వెంకటేశ్, గంగాధర నగేశ్, కల్లెపెల్లి నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాయకుల సంబురాలు
రామడుగు, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మండల శాఖ ఆద్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. మండల కేంద్రంలో పటాకులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, సర్పంచులు జువ్వాజి శేఖర్, నాగుల రాజశేఖర్, గుండి ప్రవీణ్, ఎంపీటీసీ వాంఛ మహేందర్‌రెడ్డి, కనకం కనకయ్య, గుర్రం రాజశేఖర్, ఏఎంసీ డైరెక్టర్లు బత్తిని తిరుపతి, శనిగరపు అనిల్, నాయకులు కలిగేటి లక్ష్మణ్, లంక మల్లేశం, పూడూరి మల్లేశం, తడగొండ అజయ్, రాజు, పెంటి శంకర్, ఎడవెల్లి మల్లేశం, ఆరపల్లి ప్రశాంత్, కొత్తూరి నారాయణ, శనిగరపు అర్జున్, ఎండీ మోయిజ్, బండారి చరణ్, హరికృష్ణ, అంజయ్య, కిరణ్, జలపతి, సత్తయ్య పాల్గొన్నారు.
చొప్పదండిలో..
చొప్పదండి, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీ(టీ)ఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదేశాల మేరకు చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు పటాలు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మండల కోఆప్షన్ మెంబర్ పాషా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏనుగు స్వామిరెడ్డి, బైరగోని ఆనంద్, నాయకులు మాచర్ల వినయ్ కుమార్, బందారపు అజయ్‌కుమార్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మామిడి రాజేశం, ఏలేటి తిరుపతిరెడ్డి, పెద్దెల్లి సురేశ్, చీకట్ల లచ్చయ్య, గాండ్ల లక్ష్మణ్, బీసవేణి రాజశేఖర్, కుమార్, గోపు శ్రీనివాస్ రెడ్డి, సదాశివరెడ్డి, పబ్బ శ్రీనివాస్, మావురం మహేశ్, చోటు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.