చొప్పదండి, డిసెంబర్ 7: మండల కేంద్రంలోని వేంకటేశ్వర, మణికంఠ ఆలయాల్లో బుధవారం తహసీల్దార్ రజిత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు చరణాచార్యుల సమక్షంలో తహసీల్దార్ అయ్యప్ప విగ్రహానికి అభిషేకం నిర్వహించి, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వాములకు తహసీల్దార్ ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు చేశారు. ఆలయ శాశ్వత అధ్యక్షుడు గొల్లపల్ల శ్రావణ్‌కుమార్, వెంసాని రవీందర్ యాదవ్, చైర్మన్ పొరండ్ల భాస్కర్, ఎస్వీజేసీ కళాశాల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ, ఆలయ మాజీ చైర్మన్ పొన్నం రాజేశ్, కట్ట సత్యనారాయణ, పెరుమండ్ల గంగయ్య, పిట్టల మల్లేశం, పిట్టల సత్యం, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 7: నగరంలోని రాంనగర్లో సుధగోని వేణుగోపాల్ గురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వామికి మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాష్యం శ్రీనివాస్ గురుస్వామి, గర్శకుర్తి శ్రీనివాస్ గురుస్వామి, గొడిశెల మారుతి వైదిక నిర్వహణలో గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప, హనుమాన్, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప, ఆంజనేయ స్వామికి ఫల, పంచామృతాలతో అభిషేకం జరిపించారు. ఈ పూజల్లో భూపతిరావు, సురభి మహేశ్, కోట జ్ఞానేశ్వర్, కలకొండ శశిధర్, పండుగ రవి, గుమ్మడి మధు, దేవరనేని అనిల్, గాజ శివరాం, భక్తులు పాల్గొన్నారు.