కార్పొరేషన్, డిసెంబర్ 7: జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో బుధవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కరీంనగర్‌లోని అన్ని డివిజన్ల నుంచి భారీగా బస్సుల్లో తరలివెళ్లారు. ఉదయం నుంచే ఆయా డివిజన్ల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ కండువాలు కప్పుకొని సందడి చేశాయి. నగరంలోని 33, 9వ డివిజన్లలో సభకు తరలివెళ్తున్న బస్సులను మేయర్ వై సునీల్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ సందేశాన్ని వినేందుకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు. అలాగే, నగరంలోని 33వ డివిజన్ నుంచి మహిళలతో కలిసి వచ్చిన డిప్యూటీ మేయర్ స్వరూపారాణి-హరిశంకర్ బస్సులోనే జగిత్యాలకు తరలివెళ్లారు. వావిలాలపల్లి, జ్యోతినగర్, టవర్‌సర్కిల్ తదితర ప్రాంతాల నుంచి నాయకులు, ప్రజలు బస్సుల్లో సభకు తరలివెళ్లారు. రేకుర్తి నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో యువకులు బస్సులో సీఎం సభకు తరలివెళ్లారు.
కరీంనగర్ రూరల్, డిసెంబర్ 7: కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామం నుంచి టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గాండ్ల కొమురయ్య ఆధ్వర్యంలో ఎంపీటీసీ ఎల్కపల్లి స్వరూప-చంద్రమోహన్, గాండ్ల అంజయ్య, లక్ష్మీనారాయణ, సంపత్ తదితరులు తరలివెళ్లారు. చెర్లభూత్కూర్ నుంచి టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు కూర శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీటీసీ బుర్ర తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు తిరుపతి యాదవ్, మహేశ్ తదితరులు, గోపాల్పూర్ నుంచి టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ముస్కు మల్లారెడ్డి, సర్పంచ్ ఊరడి మంజుల, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఊరడి మల్లారెడ్డి, మంద రాజమల్లు, రమేశ్, వేణు, రాజిరెడ్డి, లక్ష్మయ్య తదితరులు తరలివెళ్లారు. ఎలబోతారం నుంచి టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బుచ్చల కొమురయ్య ఆధ్వర్యంలో ఎంపీటీసీ చల్ల రామక్క, సర్పంచ్ కట్ల లక్ష్మి, చల్ల లింగారెడ్డి, కట్ల గౌతంరెడ్డి, దుర్శేడ్ నుంచి టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్రీ రామోజు తిరుపతి, సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్, మహేశ్, వెంకటేశ్వర్రావు, వేణుగోపాల్‌రావు, కుమార్, రాజ్‌కమల్, తదితరులు వెళ్లారు. మొగ్దుంపూర్లో టీఆర్ఎస్ నాయకుడు వడ్లూరి అశోక్ ఆధ్వర్యంలో రమేశ్, క్రాంతికుమార్, సురేశ్, తదితరులు తరలివెళ్లారు.
గంగాధర, డిసెంబర్ 7: సీఎం కేసీఆర్ సభకు మండలం నుంచి సుమారు 5 వేల మంది తరలివెళ్లారు. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు, ముఖ్య నాయకులు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
కొత్తపల్లి, డిసెంబర్ 7: సీఎం కేసీఆర్ సభకు మండలం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. వాహనాలను జగిత్యాల క్రాస్‌రోడ్డు వద్ద ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్‌రెడ్డి, తదితరులున్నారు. బావుపేట వద్ద వాహనాలను కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, వెలిచాల క్రాస్‌రోడ్డు వద్ద కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు జెండా ఊపి ప్రారంభించారు. తరలి వెళ్లిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు. జగిత్యాలకు వెళ్లే బస్సులను చింతకుంటలో ఎంపీటీసీ భూక్యా తిరుపతినాయక్ జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడ మైనార్టీ మండలాధ్యక్షుడు సయ్యద్ చాంద్‌పాషా, వార్డు సభ్యుడు గట్టు శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు ఉన్నారు.
రామడుగు, డిసెంబర్ 7: మండలంలోని ఆయా గ్రామాల నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలు ఉత్సాహంగా సీఎం సభకు తరలివెళ్లారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వాహనాలను సర్పంచులు, నాయకులు జెండా ఊపి ప్రారంభించారు.