సైదాపూర్, డిసెంబర్ 7: ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వం గ్రామాల వారీగా కొత్తగా రేషన్‌షాపులను ఏర్పాటు చేసిందని జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు శివరాంపల్లిలో, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి బొమ్మకల్, ఆరెపల్లి గ్రామాల్లో రేషన్ షాపులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రేషన్‌షాపుల నిర్వాహకులు ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో బియ్యం అందించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్ల వెంకటరెడ్డి, సర్పంచులు ఆవునూరి పాపయ్య, బర్మావత్ అక్షయాశ్రీనివాస్నాయక్, కాయిత రాములు, ఏనుగుల ఐలయ్య, ఎంపీటీసీలు జెల్ల మల్లేశ్, ఏరుకొండ ఇందిర, బత్తుల కొమురయ్య, నాయకులు ముత్యాల వీరారెడ్డి, చాడ ప్రకాశ్‌రెడ్డి, వర్నె మోహన్‌రావు, చిట్టి ప్రకాశ్‌రెడ్డి, రుద్రారపు రవితేజ, ఎల్కపల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
సరుకులు సకాలంలో పంపిణీ చేయాలి
హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 7: సీఎం కేసీఆర్ రూపాయికి కిలో బియ్యంతో లక్షల మంది పేదల ఆకలి తీరుస్తున్నారని, డీలర్లు రేషన్ బియ్యాన్ని సకాలంలో పంపిణీ చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని బల్దియా చైర్ పర్సన్ గందె రాధిక సూచించారు. బుధవారం పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ పకన నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, మాట్లాడారు. అనంతరం చైర్పర్సన్ రాధికతో పాటు ఇతర అతిథులు కౌన్సిలర్లు తోట రాజేంద్రప్రసాద్, వెన్నంపల్లి కిషన్‌ను డీలర్ సాయిచందు కుటుంబ సభ్యులు ఘనంగా సతరించారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు సొల్లు అశోక్, వ్యాపారులు తాళ్ల మల్లయ్య, సుద్దాల హరిశంకర్, ఎం రామచంద్రం, తాళ్ల కుమార్, పుల్లూరి లచ్చన్నతో పాటు హమాలీ సంఘం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.