సైదాపూర్, డిసెంబర్ 7: పల్లెల ప్రగతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు పేర్కొన్నారు. మండలకేంద్రంలోని వెన్కేపల్లిలో సింగిల్‌విండో ఎదుట రూ.2లక్షలతో చేపట్టిన సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో గ్రామాలు అభివృద్ధిలో పట్టణాలతో పోటీపడుతున్నాయని చెప్పారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, సర్పంచ్ కొండ గణేశ్, వైస్ చైర్మన్ కలకోటి కిషన్‌రావు, ప్యాక్స్ డైరెక్టర్లు బొమ్మగాని రాజు, మునిపాల రవి, చాడ ప్రకాశ్‌రెడ్డి, సీనియర్ నాయకులు ముత్యాల వీరారెడ్డి, ఎల్కపల్లి రవీందర్, సీఈవో చెన్నవేని శ్రీధర్, రైతులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
రాయికల్తండాలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, సర్పంచ్ బర్మావత్ అక్షయాశ్రీనివాస్నాయక్, ఎంపీటీసీ బద్దిపడిగ అనితారవీందర్రెడ్డి, దిశ కమిటీ సభ్యుడు బర్మావత్ శ్రీనివాస్‌నాయక్, నాయకులు బర్మావత్ శంకర్‌నాయక్, బాదావత్ భిక్షపతినాయక్, రమేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.