తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 7: జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో జగిత్యాల బాట పట్టాయి. ఉదయం నుంచే అన్ని మండలాల నాయకులు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో పెద్ద ఎత్తున తరలివెళ్లారు. సీఎం కేసీఆర్ సభలో పాల్గొని స్పీచ్ విని రెట్టింపు ఉత్సాహంతో తిరిగివచ్చారు. తిమ్మాపూర్ నుంచి మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో, అలుగునూర్ నుంచి కార్పొరేటర్ సల్ల శారద-రవీందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లాయి. గన్నేరువరం మండలం నుంచి జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్వంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బస్సుల్లో బయలుదేరారు.
సీఎం సభకు తరలిన పార్టీశ్రేణులు
జగిత్యాల జిల్లాలో బుధవారం నిర్వహించిన సీఎం బహిరంగ సభకు మండలం నుంచి టీఆర్ఎస్(బీఅర్ఎస్) నాయకులు భారీగా తరలి వెళ్లారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి సభకు వెళ్తున్న వాహనాలను మండల కేంద్రంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. సభకు వెళ్లిన వారిలో మానకొండూర్ సింగిల్‌విండో అధ్యక్షుడు నల్ల గోవిందరెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రామంచ గోపాల్‌రెడ్డి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు పారునంది కిషన్, టీఆర్ఎస్వీ నియోజకవర్ద కన్వీనర్ గుర్రం కిరణ్‌గౌడ్, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు అడప శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దండు మనోజ్, సర్పంచులు దేవ సతీశ్‌రెడ్డి, రొడ్డ పృథ్వీరాజ్, ఉప సర్పంచులు నెల్లి మురళి, రేమిడి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, గోపు శ్రీనివాస్‌రెడ్డి, జగన్‌గౌడ్, వెంకటస్వామి, ఇస్కుల్ల అంజయ్య తదితరులు ఉన్నారు.