తెలంగాణ చౌక్, డిసెంబర్ 7: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమంలో సీపీఐ నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్ముట్టడి ముట్టడికి బయలు దేరిన జిల్లా సీసీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ చేసిన సీపీఐ నాయకులను విడుదల చేయాలని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పోలీసు స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లను పావులుగా వాడుకుంటూ కేంద్రప్రభ్వుం అధికార దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. కేంద్రానికి అనుకూలంగా ఉన్న వారిని గవర్నర్‌గా నియమించడం సరికాదన్నారు. రాష్ట్ర గవర్నర్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేశారని గుర్తు చేశారు. ఇలాంటి వారు పార్టీకి మద్దతుగా పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గవర్నర్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పైడిపల్లిరాజు, పద్మ, మల్లమ్మ, రాజిరెడ్డి, తిరుపతి, శివ తదితరులు పాల్గొన్నారు.