శ్రీరాంపూర్, ఫిబ్రవరి 6 : శ్రీరాంపూర్ ఓసీపీని ఆదివారం సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం సందర్శించారు. ఇన్చార్జి జీఎం కే హరినారాయణ, ప్రాజెక్టు ఆఫీసర్ పురుషోత్తంరెడ్డితో కలిసి వ్యూపాయింట్ నుంచి ఓసీపీలోని పని స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఓసీపీ ఈఈ చంద్రశేఖర్‌ను ఉత్పత్తి, ప్లానింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ.. మిగిలిన రెండు నెలలు సంస్థకు చాలా ముఖ్యమైందన్నారు. రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలు సాధించేందుకు అధికారులు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించా రు. ముఖ్యంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు రోజూ వారికి కేటాయించిన మట్టి(ఓబీ) తరలించాలని శుశీ మేనేజర్ రవిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్వోటూ డైరెక్టర్ రవిప్రసాద్, ఇన్చార్జి జీఎం కే హరినారాయణగుప్త పాల్గొన్నారు.