వీణవంక, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ముదిరాజ్‌లు ఆర్థికాభివృద్ధి చెందుతున్నారని వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని గ్రామాల్లో సోమవారం ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బండ ప్రకాశ్ పిలుపుమేరకు జెండావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్వహించిన జెండావిష్కరణ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్‌లను గుర్తించి రూ.10 కోట్లతో హైదరాబాద్‌లో సంఘ భవనం నిర్మించిందన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లల పంపిణీ, మోపెడ్, ప్రమాదవశాత్తు మృతిచెందిన కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించిందని పేర్కొన్నారు. ముదిరాజ్‌ల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు రాయిశెట్టి సరిత-సంపత్, మమత-రాజు, సంఘం డైరెక్టర్లు సంపత్, రవి, రాము, నాయకులు మోహన్‌రావు, చంద్రమౌళి, రాములు, కొమురయ్య, భూమయ్య, ఓదెలు పాల్గొన్నారు.
మత్స్యకారుల దినోత్సవం
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురసరించుకొని సోమవారం హుజూరాబాద్ మున్సిపల్ కేంద్రం, బల్దియా పరిధిలోని బోర్నపల్ల్లి, ఇప్పల్‌నర్సింగాపూర్, కొత్తపల్లిలో మత్స్యకార, ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘ భవనాలు, పెద్దమ్మతల్లి దేవాలయాల వద్ద జెండాలను ఆవిషరించారు. బోర్నపల్లి మత్స్యకారులు గ్రామం నుంచి పట్టణం వరకు వాహన ర్యాలీ నిర్వహించి అంబేదర్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. హుజూరాబాద్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోసుల కిశోర్, మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు గుడ్డెలుగుల ప్రదీప్ ఆధ్వర్యంలో జెండాలు ఆవిషరించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, నాయకులు, మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు, సొసైటీ కార్యవర్గ సభ్యులు, కులస్తులు పాల్గొన్నారు
సైదాపూర్‌లో..
మండల కేంద్రం తో పాటు గ్రామాల్లో ప్రపంచ మత్స కారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జెండావిషరణ చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకుడు రాయిశెట్టి చంద్రయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పెసరు కుమారస్వామి, మండలాధ్యక్షుడు పోలు ప్రవీణ్, యూత్ అధ్యక్షుడు నీర్ల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.