భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 16 : కొత్తగూడెం కార్పొరేషన్ మేయరు పీఠం సిపిఐ దక్కించుకుంది. తొలి మేయర్గా మూడ్ గణేష్ సోమవారం నగర పాలక సంస్థలో ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 60 డివిజన్లకు సిపిఐ, కాంగ్రెస్ చేరో 22 స్థానాలను గెలుచుకోవడంతో పూర్తి మెజారిటీ ఎవరికి రాలేదు. దీంతో కాంగ్రెస్ కు సిపిఐ కి పొత్తు తప్పలేదు. రెండు పార్టీలు రెండున్నరేండ్లు మేయర్ చేసుకునే ఒప్పందంతో రాజీ కుదుర్చుకున్నారు. సిపిఐ మేయర్గా మూడు గణేశ్, డిప్యూటీ మేయర్ గా లలిత కుమారి లను ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎంపీ రఘురాంరెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కమిషనర్ సుజాత పాల్గొన్నారు.