పోటెత్తిన గోదావరి.. ఉరకలేస్తున్న కృష్ణమ్మ
ఎగువ కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది.. కృష్ణమ్మ ఉరలేస్తున్నది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను వరద ముంచెత్తుతున్నది. శుక్రవారం కడెం ప్రాజెక్టుతోపాటు, లోకల్ క్యాచ్మెంట్ ఏరియాల నుంచి ఎల్లంపల్లికి 44వేల క్యూసెక్కుల వరద వస్తున్నది.
- ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఎగువ కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, రాష్ట్రంలోనూ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతున్నది.. కృష్ణమ్మ ఉరలేస్తున్నది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను వరద ముంచెత్తుతున్నది. శుక్రవారం కడెం ప్రాజెక్టుతోపాటు, లోకల్ క్యాచ్మెంట్ ఏరియాల నుంచి ఎల్లంపల్లికి 44వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాణహిత నుంచి వచ్చే వరద 11 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నది. సమ్మక్కసాగర్ వద్ద 12.60 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. ఏటూరునాగారం, భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. కృష్ణమ్మ సైతం ఉరలేస్తున్నది. ప్రస్తుతం జూరాలకు 1.22 లక్ష క్యూసెక్కులు వరద వస్తుండగా, దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు 89వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
నంది, గాయత్రిలో నడుస్తున్న పంపులు
ధర్మారం/ రామడుగు, జూలై 31 : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ -2 పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు శుక్రవారం మూడో రోజు కొనసాగాయి. ఐదు పంపుల ద్వారా 15,750 క్యూసెకులను నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. అక్కడి నుంచి అదే జంట సొరంగాల ద్వారా గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు.
శ్రీశైలం డ్యామ్ @ 834.40 అడుగులు
గద్వాల/నాగర్‌కర్నూల్, జూలై 31 : జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ ఉరకలెత్తుతున్నది. శుక్రవారం 1.22 లక్షల క్యూసెక్కులు రాగా.. 24 గేట్లు ఎత్తి దిగువకు 1,36,689 క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 834.40 అడుగులకు చేరగా.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 54.34 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదస్థాయిలో పెన్‌గంగ
ఆదిలాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు మహారాష్ట్ర వరదనీటితో పెన్‌గంగా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. జిల్లాలోని భీంపూర్, జైనథ్, బేల మండలాల్లో పరీవాహక పంట పొలాలు నీటమునిగాయి. జైనథ్ మండలం డొల్లార వద్ద ఉత్తరాది రాష్ర్టాలను కలిపే జాతీయ రహదారి 44 పై ఉన్న వంతెనను తాకుతూ ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగులను దాటింది. భద్రాద్రి ఏజెన్సీలోని వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలం వీరాపురం ఇసుక ర్యాంపును గోదావరి వరద చుట్టుముట్టింది.

పాయలోని ఇసుక ర్యాంపులో లారీ డ్రైవర్లతోపాటు 46 మంది ర్యాంపు సిబ్బంది,లారీలు చిక్కుకున్నాయి. రెస్క్యూ బృందాలను యంత్రాలు, తెప్పలపై వెళ్లి ర్యాంపు సిబ్బంది, డ్రైవర్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
– భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం/ చర్ల
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

