Wheat Flour | గోధుమ పిండి పురుగులు పట్టకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి..!
మన వంటగదిలో ఉండే వాటిల్లో గోధుమపిండి కూడా ఒకటి. రోటీ, పరాఠా, స్వీట్స్ వంటి వివిధ రకాల వంటకాలను దీనితో తయారు చేస్తూ ఉంటాం. ఇక ఈ గోధుమపిండిని చాలా మంది ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తూ ఉంటారు.
Wheat Flour | మన వంటగదిలో ఉండే వాటిల్లో గోధుమపిండి కూడా ఒకటి. రోటీ, పరాఠా, స్వీట్స్ వంటి వివిధ రకాల వంటకాలను దీనితో తయారు చేస్తూ ఉంటాం. ఇక ఈ గోధుమపిండిని చాలా మంది ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తూ ఉంటారు. అయితే సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల గోధుమపిండి పురుగులు పట్టడం, ముద్దలు కట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. పురుగులు పట్టిన పిండితో మనం ఎలాగూ రోటీలను తయారు చేయలేం. ఇది వాడడానికి కూడా అనుకూలంగా ఉండదు. పిండిని సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల ఉష్ణోగ్రతల్లో తేడాలు వచ్చి తేమలో వచ్చే మార్పుల వల్ల కీటకాలు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కనుక గోధుమపిండిని సరైన పద్దతిలో నిల్వ చేసుకోవడం చాలా అవసరం. కొన్ని చిట్కాలను ఉపయోగించడం వల్ల గోధుమపిండి పాడవకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ చేసుకోవచ్చు.
ఫ్రిజ్లో పెట్టాలి..
గోధుమపిండిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది. గాజు పాత్రలో లేదా గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి మూత పెట్టి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేయాలి. తేమ లోపలికి వెళ్లకుండా మూత గట్టిగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల పిండి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది. తేమ కారణంగా పిండి త్వరగా చెడిపోతుంది. కనుక పిండిని స్టీల్ డబ్బాలో ఉంచి నిల్వ చేయాలి. స్టీల్ డబ్బాలో నిల్వ చేసే ముందు దానిలో తడి లేకుండా చూసుకోవాలి. డబ్బాను ఎండలో ఆరబెట్టడం వల్ల తేమ లేకుండా పొడిగా అవుతుంది. అలాగే పిండిలో 4 లేదా 5 టీ స్పూన్ల ఉప్పును కలిపి నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్ల కీటకాలు పిండిలోకి వెళ్లకుండా నిరోధించవచ్చు.
ఉప్పు కలిపితే..
స్టీల్ డబ్బాలో సగం వరకు పిండి వేసి అందులో 2 లేదా 3 టీ స్పూన్ల ఉప్పు కలపాలి. తరువాత మిగిలిన పిండి వేసి అందులో 1 లేదా 2 టీ స్పూన్ల ఉప్పు వేసి కలిపి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి పురుగులు పట్టకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది. ఉప్పుకు బదులుగా పిండిలో బగారా ఆకులు వేసి కూడా నిల్వ చేసుకోవచ్చు. బగారా ఆకులకు ఉండే వాసన పిండి పురుగు పట్టకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. ఇక పిండిని కొనుగోలు చేసే ముందు తయారీ తేదీని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఒక నెల కంటే ముందు తయారైన పిండిని కొనుగోలు చేయకపోవడమే మంచిది. తయారీ తేదీ ఒక నెల లోపు ఉన్న పిండిని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం వల్ల పిండి ఎక్కువ సమయం తాజాగా ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మనం గోధుమపిండిని పాడవకుండా ఎక్కువ కాలం పాటు తాజాగా ఉండేలా నిల్వ చేసుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

