గంగాధర, నవంబర్ 21: అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందిన వారికి సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేస్తూ ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురికి రూ. 11 లక్షల 57 వేల ఆర్థిక సాయం మంజూరైంది. కాగా, బూరుగుపల్లిలోని నివాసంలో సోమవారం ఆయన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులంతా సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. కాగా, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు, ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, జోగు లక్ష్మీరాజం, మాల చంద్రయ్య, కొంకటి శంకర్, ఎంపీటీసీలు కోలపురం లక్ష్మణ్, నాయకులు తడిగొప్పుల రమేశ్, వడ్లూరి ఆదిమల్లు, గుండవేణి తిరుపతి, గడ్డం స్వామి, మ్యాక వినోద్, గంగాధర మోహన్, గంగాధర నగేశ్, ద్యావ సంజీవ్ పాల్గొన్నారు.
పైరవీలకు తావులేకుండా దళితబంధు అమలు
నియోజకవర్గంలో అర్హులందరికీ దళితబంధు యూనిట్లు అందిస్తామని, లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పైరవీలకు తావులేదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దళిత వాడల్లో విద్యుత్ సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గానికి దళితబంధు పథకం కింద 500 యూనిట్లు మంజూరయ్యాయని, అధికారులు అర్హులను ఎంపిక చేసి యూనిట్లు అందజేస్తారని తెలిపారు. ప్రతి గ్రామంలో జనాభా ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం డబ్బులు ఇచ్చిన వారిపై, తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు ప్రయత్నిస్తామని చెప్పారు. గ్రామంలో ప్రభుత్వ స్థలాలను సర్వే చేసి ఐకేపీ, సింగిల్‌విండో కొనుగోలు కేంద్రాలకు కేటాయించాలని అధికారులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, సింగిల్‌విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీచైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, తహసీల్దార్ రజిత, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.