ఎలిగేడు నవంబర్ 21: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నదని ఎమ్మె ల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావు స్పష్టం చేశారు. తన స్వగ్రామమైన లోకపేట గ్రామంలో 4 లక్షల ఎమ్మెల్సీ సీడీపీ నిధులతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి, 5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సారథ్యంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తూ ప్రజలకు తాగు, సాగునీరు, రోడ్లు తదితర మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వాటి ఫలాలను అర్హులందరికీ అందేలా నాయకులు, కార్యకర్తలు చూడాలని కోరారు. మండల రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్, ఆర్ఐలను బదిలీ చేయాలని ఈ నెల 19న జరిగిన మండల సభలో సభ్యులు సభ దృష్టికి తెచ్చిన తీర్మానాన్ని ఆమోదించారు. ప్రజలకోసం పనిచేయని అధికారులను తక్షణం బదిలీ చేయాలని, అలాంటి అధికారులు ఇక్కడ తన మండలంలో ఉండాల్సిన పనిలేదని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ఫోన్‌ద్వారా సంబంధిత అధికారులకు చెప్పారు.
ఇక్కడ జడ్పీటీసీ మండిగ రేణుక, సర్పంచ్ దేవరనేని ప్రభావతి, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, సర్పంచులు బూర్ల సింధూజ, మాడ కొండాల్‌రెడ్డి, పెద్దోల్ల అయిలయ్య, అర్శనపెల్లి వెంకటేశ్వరరావు, ఆర్కే రాజా, నాయకులు కొక్కిరాల మహేశ్వరరావు, ఉప సర్పంచ్ మల్లేశం, రాజేశ్వరరావు, ఒద్ది ప్రసాదరావు, దేవరనేని వేణుమాధవరావు, బూర్ల వెంకటసత్యం, తానిపర్తి మోహన్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్, గొల్లె భూమేష్, రాజేశ్వర రావు, సుధాకర్ రావు, లక్ష్మణ్‌రావు, రమణారావు, దుగ్యాల సంతోష్‌రావు, కల్లెం శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తిరుమలేశ్, తదితరులు ఉన్నారు.