కొత్తపల్లి, నవంబర్ 21: గ్రంథాలయాలు దే వాలయాలతో సమానమని మంత్రి గంగుల క మలాకర్ అభివర్ణించారు. కరీంనగర్ జిల్లా గ్రం థాలయంలో సోమవారం సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ గ్రంథాలయాల వారోత్సవాల ముగిం పు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉన్నదని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పాలకవర్గ సభ్యుడిగా వ్యవహరిస్తే స్వాతంత్య్ర సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారా వు చైర్మన్‌గా పనిచేశారని గుర్తు చేశారు. ఇంతటి ఖ్యాతి కలిగిన గ్రంథాలయానికి మరింత వన్నె తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడే తాను చదువుకున్నానని, ఈ గ్రంథాలయం తనకు ఆలయం వంటిదన్నారు.
డిజిటల్ యుగంలో లైబ్రరీలకు కొంత ఆదరణ తగ్గినప్పటికీ వాటికి ఉండాల్సిన స్థానం అలాగే ఉన్నదన్నారు. గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వారికి కరీంనగర్ బల్దియా ఆధ్వర్యంలో 5కే మధ్యాహ్న భోజన పథకాన్ని అందుబాటులో ఉంచామన్నారు. 7.5 కోట్లు స్మార్ట్‌సిటీ నిధులతో ఆధునిక భవనాన్ని నిర్మిస్తామని, పుస్తకాల డిజిటలైజేషన్ కోసం మరో 2 కోట్లు కేటాయించామని చెప్పారు. పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారికి కావాల్సిన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని, పుస్తకాల డిజిటలైజేషన్ తర్వాత ఒక్క క్లిక్ చేస్తే పుస్తకం ఎక్కడ ఉందో తెలియడంతో పాటు అవసరమైన సమాచారం క్షణంలో ముందుంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణీ హరిశంకర్, కరీంనగర్ వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే రామకృష్ణ, వయోజన విద్య ఉప సంచాలకుడు జయశంకర్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఏ సరిత, సిబ్బంది కే మల్లయ్య, టీ రాజమల్లు, కే శ్రీమతి, జీ సరిత, జే గౌతమి, పీ నాగభూషణం, ఎం మహేశ్, ఎం కనకలక్ష్మి, బీ కిషన్, మహేందర్‌రెడ్డి, ఏ సుధీర్‌కుమార్, పీ ఐలయ్య ఉన్నారు.