గంగాధర, నవంబర్ 21: మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని సర్పంచ్ ఆకుల శంకరయ్య పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లాపూర్లో సోమవారం సహకార సంఘం ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్ హాజరైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు కుందేళ్ల బాలకిషన్ సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం మండల ఉపాధ్యక్షుడు పిడుగు తిరుపతి, పట్టణాధ్యక్షుడు బీ వెంకటి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మాజీ మండలాధ్యక్షుడు చీకట్ల లచ్చయ్య, మంద నర్సయ్య, నాయకులు కోమళ్ల రాజేశం, ఘనవేని వెంకట్రాజం, చిల్ల ఐలయ్య, మంద శ్రీరాం, పిట్టల రాములు, భీమయ్య, రామచంద్రం పాల్గొన్నారు.